SBI Home Loan : ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో కీలక మార్పులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India )  సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారికి శుభవార్త తెలిపింది.  తన హోమ్ లోన్ వడ్డీ  రేట్లను భారీగా తగ్గించింది.  దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. 

Last Updated : Jul 1, 2020, 05:46 PM IST
SBI Home Loan : ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో కీలక మార్పులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India )  సొంత ఇంటి ( Own House )  కలను సాకారం చేసుకునే వారికి శుభవార్త తెలిపింది.  తన హోమ్ లోన్ వడ్డీ  రేట్లను భారీగా తగ్గించింది.  దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. 

 ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లను (Home Loan Interest Rate )  తగ్గించింది. తగ్గిన ఈ వడ్డీ రేట్లు జులై  1 నుంచే అమలులోకి వచ్చాయి. తాజాగా 6.95 శాతానికే ఇంటి రుణాలు అందిస్తోంది.  అయితే ఇంతకుముందే జూన్ నెలలో ఎస్‌బీఐ  ఈబీఆర్ ( External Benchmark Linked Lending Rate ),  ఆర్ఎల్ఎల్ఆర్ ( Repo Linked Lending Rate) బేసిక్ సూచీలో  లో 40 పాయింట్స్ తగ్గించింది.

Also Read :2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

 

ఒకప్పుడు కొన్ని బ్యాంకులు హోమ్ లోన్స్‌ను 9 శాతానికి అందించేవి. అయితే స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఒక వైపు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మరో వైపు ఈ సెగ్మెంట్‌లో ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.  అయితే  ఇప్పటికే  బ్యాంక్ ఆప్ బరోడా ( Bank Of Baroda )  అతి తక్కువ వడ్డీ రేటుకు  ( 6.85 శాతం ) హోమ్ లోన్ అందీస్తోంది.  తరువాత స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది . Also Read : Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..

 

 

Trending News