SBI SCO Recruitment 2024: స్టేట్ బ్యాంక్‌ బంపర్ ఆఫర్.. డిగ్రీపట్టా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా అప్లై చేసుకోండి..

SBI SCO Recruitment 2024: మీరు బ్యాంక్ ఉద్యోగం పొందడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇది మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

Written by - Renuka Godugu | Last Updated : Feb 16, 2024, 11:04 AM IST
SBI SCO Recruitment 2024: స్టేట్ బ్యాంక్‌ బంపర్ ఆఫర్.. డిగ్రీపట్టా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా అప్లై చేసుకోండి..

SBI SCO Recruitment 2024: మీరు బ్యాంక్ ఉద్యోగం పొందడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇది మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్,సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ తదితర పోస్టులకు నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించడం ద్వారా SBIలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

దరఖాస్తుకు చివరి తేదీ:
అభ్యర్థులు 2024 మార్చి 4 వరకు SBIలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇదీ చదవండి: UPSC Exam 2024: UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. 1056 ఖాళీల భర్తీ..

SBI రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 131 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్) 23 పోస్టులు,
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్ ) 51,
మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్ ) 3,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ) 3 పోస్టులు, 
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ 1 పోస్టులు 
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 50 పోస్ట్‌లను భర్తీ చేయనుంది.

ఇదీ చదవండి: సుప్రీంకోర్టు సంచలనతీర్పు.. ఎలక్టోరల్ బాండ్స్ తక్షణ నిషేధం..

వయో పరిమితి: 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయోపరిమితి గురించి తెలుసుకోవడానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.

అర్హత..
మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు MBA (ఫైనాన్స్)/PGDBA/PGDBM/MMS (ఫైనాన్స్)/CA/CFA/ ICWA ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News