Congress President Election: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. చాలా మంది సీనియర్, యువ నేతలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని ఆకాంక్షించారని..అందుకే బరిలోకి దిగానన్నారు. ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న సిద్ధాంతాన్ని ఆచరించారని..అందుకే నామినేషన్ వేసిన నాడే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారని తెలిపారు.
ఇవాళ ఢిల్లీలో సీనియర్ నేతలు దీపేందర్ హుడా, సయ్యద్ నజీర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నాయన్నారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటిని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఫైర్ అయ్యారు మల్లికార్జున ఖర్గే. ఇటు శశిథూరూర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతం సమిష్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓ వ్యక్తిగా తీసుకోనని తేల్చి చెప్పారు. తన వెనుక గాంధీ కుటుంబం ఉందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ నేతల ఆహ్వానం మేరకే పోటీ చేస్తున్నానన్నారు. ఇటు సీనియర్ నేతలు దీపేందర్ హుడా, సయ్యద్ నజీర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధుల పదవికి రాజీనామా చేశారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే తరపున పోటీ చేస్తామని దీపేందర్ హుడా, సయ్యద్ నజీర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్ స్పష్టం చేశారు. మొత్తంగా కాంగ్రెస్ చీఫ్ పదవికి మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ చేయనున్నారు. ఈనెల 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటిలోగా నామినేషన్ ఉపసంహరణ లేకపోతే పోటీ అనివార్యం కానుంది. ఈనెల 17న అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది.
ఈనెల 19న ఓట్ల లెక్కింపు ఉండనుంది. అనంతరం తుది ఫలితాలు వెల్లడించారు. ఈఎన్నికల్లో దాదాపు 9 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఐతే అంతలోపే ఎన్నిక ఏకగ్రీవమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మల్లికార్జున ఖర్గేనే చీఫ్ అవుతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
Also read:Rangareddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్..మరికొన్ని రోజులు వానలే వానలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Congress President Election: పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం..శశిథరూర్‌కు మల్లికార్జున ఖర్గే కౌంటర్..!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
బరిలో ఇద్దరు నేతలు
ఖర్గే కీలక వ్యాఖ్యలు