Shahi Eedgah Masjid Issue: షాహీ ఈద్గా మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు

Shahi Eedgah Masjid Issue: మొన్న జ్ఞానవాపి..నేడు మధుర. వివాదాస్పద మసీదులపై హైకోర్టు కీలక తీర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు సర్వేకు ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2023, 08:39 PM IST
Shahi Eedgah Masjid Issue: షాహీ ఈద్గా మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు

Shahi Eedgah Masjid Issue: బాబ్రీ మసీదు తరువాత దేశంలో కొన్ని మసీదుల వివాదం తెరపైకి వస్తోంది. మొన్న వారణాసిలోని జ్ఞానవాపి మసీదు. ఇవాళ మధురలోని షాహీ ఈద్గా మసీదు. మధురలోని షాహీ ఈద్దా మసీసు వర్సెస్ శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 

ఉత్తరప్రదేశ్ మధురలో 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదు నిర్మించారనేది హిందూ సంఘాల ఆరోపణ. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదు శ్రీకృష్ణుని జన్మభూమిగా వివాదం రేగుతోంది. హిందూసేనకు చెందిన విష్ణుగుప్త ఈ మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో గత ఏడాది పిటీషన్ దాఖలు చేశాడు. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందిందిగా ప్రకటించాలని కోరాడు. 
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం సంఘాలు కౌంటర్ పిటీషన్ దాఖలు చేశాయి. 

ఈ అంశంపై ఇవాళ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మదురలోని షాహీ ఈద్గా మసీదులో ప్రాధమిక సర్వే చేయాలని ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమీషనర్ బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. సర్వేకు సంబంధించిన ఇతర విధి విధానాలను ఈ నెల 18 కోర్టు నిర్ణయించనుంది. మసీదులోపల హిందూ దేవాలయాల చిహ్నాలున్నాయని హిందూ సంఘాలు తెలిపాయి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని అభివర్ణించారు. 

అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో కూడా కోర్టు ఆదేశాల మేరకు సర్వే జరిగింది. ఇప్పుడు మధుర అంశం కూడా అలహాబాద్ కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు నోచుకోనుంది. 

Also read: Ap Inter Exams 2024: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్, ఏ పరీక్ష ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News