బీజేపిపై సంచలన ఆరోపణలతో విరుచుకుపడిన శివసేన!

బీజేపిపై మండిపడిన శివసేన.. సంచలన ఆరోపణలు!

Last Updated : Nov 16, 2019, 01:05 PM IST
బీజేపిపై సంచలన ఆరోపణలతో విరుచుకుపడిన శివసేన!

ముంబై: బీజేపిపై ఆ పార్టీ పాత మిత్రపక్షమైన శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మహారాష్ట్రలో మారుతున్న తాజా రాజకీయ సమీకరణాలు చూసి బీజేపి తట్టుకోలేకపోతోందని శివసేన మండిపడింది. నేటి సామ్నా పత్రికలో మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై ''రాష్ట్రపతి పాలన మాటున హార్స్ ట్రేడింగ్'' శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించిన శివసేన..  ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ మధ్య చిగురించిన బంధాన్ని చూసి బీజేపి జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించింది. ఒకవేళ ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని బీజేపి శపించడం ఏంటని శివసేన ప్రశ్నించింది. రాష్ట్రపతిపాలన ముసుగులో బీజేపి ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నుతోందని శివ సేన ఆరోపించింది.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ సరైన మెజార్టీతో ముందుకు రానందున రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి నివేదిక సమర్పించిన నేపథ్యంలో మంగళవారం నుంచి మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించిన సంగతి తెలిసిందే.

Trending News