రామాయణ ఎక్స్‌ప్రెస్ : డెస్టినేషన్ ఇండియా..

భారతీయ రైల్వే సరికొత్త ఆలోచనతో  రామాయణ ఎక్స్‌ప్రెస్ పేరుతో మరో కొత్త రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇందులో  ప్రయాణించేవారికి రామాయణ కాలం గుర్తొచ్చే విధంగా భక్తి పారవశ్యంతో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు బోగీల లోపల రామాయణ కావ్యానికి ప్రతీక అనే విధంగా అలంకరణ ఉంటుందని, భజనలు వినిపిస్తాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. 

Last Updated : Feb 14, 2020, 11:56 PM IST
రామాయణ ఎక్స్‌ప్రెస్ : డెస్టినేషన్ ఇండియా..

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సరికొత్త ఆలోచనతో  రామాయణ ఎక్స్‌ప్రెస్ పేరుతో మరో కొత్త రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇందులో  ప్రయాణించేవారికి రామాయణ కాలం గుర్తొచ్చే విధంగా భక్తి పారవశ్యంతో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు బోగీల లోపల రామాయణ కావ్యానికి ప్రతీక అనే విధంగా అలంకరణ ఉంటుందని, భజనలు వినిపిస్తాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ రైల్లో యాత్రికులు రామాలయంలో ఉన్న అనుభూతి పొందుతారని, ఒక విధంగా దీన్ని ‘నడిచే ఆలయం’ అనవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు వచ్చే మార్చి 10 తర్వాత పట్టాలమీదికి వస్తుందని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. 

ఈ రైలుకు సంబంధించిన సంవత్సర కాలమానాన్ని వచ్చేవారం విడుదల చేస్తామన్నారు. దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కుల్లో వివిధ ప్రాంతాల నుంచి ఈ రైలు బయలుదేరుతుందని, అందువల్ల దేశవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల ప్రజలు ఈ రైలు సౌకర్యాల్ని వినియోగించుకోగలుగుతారని తెలిపారు. రైలు బయట, లోపల రామాయణాన్ని ప్రతిబింబించే దృశ్యాలుంటాయని వీకే యాదవ్ మీడియాకు వివరించారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News