Ooty Tragedy: ఊటీలో ఊహకందని విషాదం.. బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం..

Ooty Tragedy: తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 05:15 PM IST
Ooty Tragedy: ఊటీలో ఊహకందని విషాదం.. బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం..

house collapses in Ooty: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో (under-construction building collapsed in Ooty) ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వర్కర్స్ ను ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. శిథిలాల కింద ఒకరు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఊటీ సమీపంలో లవ్‌డేల్‌లో(Lovedale) చోటుచేసుకుంది. పాత భవనాన్ని పునరుద్దరించే పనులు చేపట్టగా.. అందులో కొంత భాగం కుప్పకూలి.. పనిచేసే కార్మికులపై పడింది. ఆ సమయంలో దాదాపు 13 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతి చెందిన వారంతా మహిళలు. మృతుల‌ను సంగీత (35), షకీల (30), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు. మృతులంతా ఉతగై గాంధీనగర్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అయితే మరో కార్మికుడు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also read: Rajyasabha Elections 2024: దేశంలో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Also Read: Maharashtra: ఓయో రూమ్ లో షాకింగ్ ఘటన.. ప్రియురాలిని మాట్లాకుందామని పిలిచి.. ఆ తర్వాత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x