Snake Venom: డార్జిలింగ్‌లో రూ.30 కోట్లు విలువైన పాము విషం పట్టివేత!

Snake Venom: రూ.30 కోట్ల విలువైన పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2022, 07:06 AM IST
Snake Venom: డార్జిలింగ్‌లో రూ.30 కోట్లు విలువైన పాము విషం పట్టివేత!

Snake Venom: పశ్చిమబెంగాల్‌  డార్జిలింగ్‌ జిల్లాలోని ఘోష్‌పుకూర్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున పాము విషాన్ని (Snake Venom) స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అక్రమంగా తరలిస్తున్న ఈ విషం బరువు దాదాపు రూ. 2.4 కిలోలు ఉంది.  ఈ విషానికి మార్కెట్లో రూ. 30 కోట్ల వరకు రేటు పలుకుతుందని ఘోష్పుకూర్ అటవీ రేంజ్ రేంజర్ సోనమ్ భూటియా తెలిపారు. దీనిని ఓ క్రిస్టల్ జార్ లో భద్రపరిచారు.ఇందులో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సరాఫత్‌గా గుర్తించారు. 

"అంతర్జాతీయ మార్కెట్ రేటు ప్రకారం, స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు రూ. 30 కోట్లు. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేశాం. ఈ విషం ఫ్రాన్స్‌కు చెందినది మరియు బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయబడింది. క్రిస్టల్ కంటైనర్‌కు ఫ్రెంచ్ ట్యాగ్ ఉంది' అని అధికారులు తెలిపారు. ఈ విషాన్ని నేపాల్ మీదుగా చైనాకు తరలించాలన్నదే అసలు ఉద్దేశమని నిందితుడి తెలిపాడు. 

“సరఫత్ ఈ ప్రాంతం గుండా పాము విషాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని... అతను మోటారుసైకిల్‌లో సరుకును తీసుకువెళుతున్నాడని నిషూ వర్గాల నుంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉత్తర బెంగాల్‌లోని అటవీ శాఖ అధికారులు 35 రోజుల వ్యవధిలో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 10న జల్పాయ్ గురి జిల్లాలో రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: Karnataka Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం.. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంపో! 9 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

 

Trending News