Sabarimala Special Trains: శబరిమల సందర్శన సమయం ఇది. సంక్రాంతి వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు బిజీగా ఉంటాయి. రిజర్వేషన్ లభించడం కష్టమౌతుంటుంది. రైళ్ల రద్దీ, భక్తుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం.
శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ 26 రైళ్లు ఏపీ, తెలంగాణ, కేరళ మధ్య తిరగనున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29 తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1 తేదీల్లో నడవనున్నాయి.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
నెంబర్ 07143 మౌలాలీ నుంచి కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబర్ 6,13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. తిరిగి ఇదే రైలు కొల్లాం నుంచి మౌలాలీకు నెంబర్ 07144 తో డిసెంబర్ 8, 15,22,29 తేదీల్లో నడుస్తుంది. ప్రతి రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ తరగతి, జనరల్ భోగీలుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ నవంబర్ 20 అంటే ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. శబరిమల సీజన్ కావడంతో ఈ సమయంలో టికెట్లు లభించక భక్తులు ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. భక్తుల ఇబ్బందుల్ని దూరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.
Also read: School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.