SSC MTS Notification 2024: 10వ తరగతి పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 8,326 పోస్టులతో భారీ నోటిఫికేషన్‌

SSC MTS Notification 2024 Out: ప్రతి ఏడాది స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా నోటిఫికేషన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తుంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టులను పరీక్ష ద్వారా ఎంపిక చేస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 28, 2024, 09:48 AM IST
SSC MTS Notification 2024: 10వ తరగతి పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 8,326 పోస్టులతో భారీ నోటిఫికేషన్‌

SSC MTS Notification 2024 Out: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. SSC MTS 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టులను భర్తి చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ చివరితేదీ, పరీక్ష తదితర వివరాలు తెలుసుకుందాం.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎంటీఎస్‌ (మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్) నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ sss.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31. పది పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. SSC MTS దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌చేసి వివిధ ప్రభుత్వ మంత్రిత్వ, డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

SSC MTS 2024 ద్వారా 8,326 ఖాళీలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ కూడా ఇప్పటికే విడుదల అయింది.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల దరఖాస్తు నిన్న మొదలైంది. అప్లికేషన్‌కు చివరితేదీ జూలై 31, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఆగస్టు 1. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పీడీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. అందులో పరీక్ష విధానం, తేదీ ఇతర వివరాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. లేడీ రిపోర్టర్ పై కుక్కల్ని ఉసిగొల్పి పైశాచికం.. వీడియో వైరల్..

ప్రతి ఏడాది స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా నోటిఫికేషన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తుంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టులను పరీక్ష ద్వారా ఎంపిక చేస్తోంది. ఈ పోస్టులకు నైపుణ్యత కనబర్చిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఫిజికల్‌ ఎఫిషీయన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తుంది. అన్నింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 18,000-22000 వరకు జీతభత్యాలను అందించనుంది.

ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?

ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబర్‌ లేదా నవంబర్‌ 2024లో పరీక్షలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 8326 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో మల్టీ టాస్కింగ్‌ 4887 ఉద్యోగాలు, 3439 హవల్దార్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత సంవత్సరంలో 1558 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అందులో మల్టీ టాస్కింగ్‌ 1198, హవల్దార్‌ 360 పోస్టులను భర్తీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News