స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..!!

'కరోనా వైరస్' విస్తరిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు విపరీతంగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

Last Updated : May 13, 2020, 10:26 AM IST
స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..!!

'కరోనా వైరస్' విస్తరిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు విపరీతంగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

ఐతే నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపన్ ప్యాకేజీ ప్రకటించారు. ఈ క్రమంలో భారత స్టాక్ మార్కెట్లలో తిరిగి నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు భారీ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రకటించనున్నారు. దీంతో మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. మదుపరులు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. 
 
ఉదయం దళాల్ స్ట్రీట్ ప్రారంభం కాగానే బీఎస్ఈ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లతో దూసుకెళ్లింది. అటు జాతీయ స్టాక్ ఎక్చేంజీ నిఫ్టీ సైతం 300 పాయింట్లు  లాభపడింది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్ల లాభంతో 32వేల 11 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అటు జాతీయ స్టాక్ ఎక్చేంజీ నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 9 వేల 377 వద్ద కొనసాగుతోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించి ప్రకటించే వరకు స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే పయనించే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.  

ఇవాళ ఉదయం నుంచి ఐసీఐసీఐ, అల్ట్రా టెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరోమోటోకార్ప్, సుజుకీ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో పయనించాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News