Bihar Bridge collapse: బీహర్ లో ఇటీవల వరుసగా బ్రిడ్జీలు కూలిపోతున్న ఘటనలు వివాదాస్పదంగా మారాయి. వీటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నవి కూలీపోగా, మరికొన్ని మాత్రం ఆల్రేడీ పూర్తి అయినవి ఉన్నాయి. కానీ వారంరోజుల వ్యవధిలో నాలుగు బ్రిడ్జీలు కూలిపోయిన ఘటన వివాదస్పదంగా మారింది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో వంతెన కూలిపోయింది. కంకై ఉపనదిపై 70 మీటర్ల వంతెనను నిర్మించారు. ఇది బహదుర్‌గంజ్, దిఘల్‌బ్యాంక్ బ్లాక్‌లను కలుపుతుంది. ఒక్కసారిగా ఇది కూలిపోవడం రెండు పట్టణాల మధ్య కనెక్టివిటీని పూర్తిగా తెగిపోయింది. ఈ ఘటనలో మాత్రం ఎవరికీ గాయాలు కాలేదు.
#WATCH | Bihar | A portion of a bridge over the Bakra River has collapsed in Araria pic.twitter.com/stjDO2Xkq3
— ANI (@ANI) June 18, 2024
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు, నదిలో నీటిమట్టం పెరిగిందని, బలమైన ప్రవాహం కారణంగా వంతెన మధ్యలో ఉన్న పలు స్తంభాలు సుమారు ఒకటిన్నర అడుగుల మేర భూమిలో కుంగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జీకి సంబంధించిన వీడియోలు, వంతెన మధ్య భాగం కుంగిపోయి, వేగంగా ప్రవహించే నదిని దాదాపు తాకినట్లు చూపించాయి. అది ఎప్పుడైనా రెండుగా విచ్ఛిన్నం కావచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న బహదుర్‌గంజ్ పోలీస్ స్టేషన్ చీఫ్ అభినవ్ పరాసర్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే ఆ ప్రాంతాన్ని ఇరువైపులా బారికేడ్ ను ఏర్పాటు చేసి, వాహనాల కదలికను నిలిపివేశారు. దాదాపు ఆరేళ్ల క్రితం వంతెనను నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ తుషార్ సింగ్లా మాట్లాడుతూ, కంకై నదిని మహానంద నదికి కలిపే చిన్న ఉపనది అయిన మడియాపై 2011లో వంతెనను నిర్మించారు. "నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. వంతెన స్తంభాలలో ఒకటి బలమైన ప్రవాహానికి తట్టుకోలేకపోయిందని అన్నారు.
ఇదిలా ఉండగా.. గత వారం సివాన్, అరారియా జిల్లాల్లో మూడు వంతెనలు కూలిన సంఘటనలు చోటు చేసుకున్నవిషయం తెలిసిందే. జూన్ 19న, బీహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ప్రారంభానికి ముందే కూలిపోయింది. ₹ 12 కోట్లతో నిర్మించిన వంతెన సెకన్లలో రెండుగా విడిపోయింది. స్పాట్ నుండి భయంకరమైన వీడియోలో భారీ కాంక్రీటు భాగాలు కొట్టుకుపోతున్నట్లు రికార్డు అయ్యాయి.
Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో బీహర్ లో రాష్ట్రంలో ప్రజాపనుల నాణ్యతపై ప్రజల ప్రశ్నిస్తున్నారు. తమ నుంచి పన్నుల రూపంలో సేకరించిన డబ్బులన్ని నీటి పాలు చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అపోసిషన్ నేతులు సైతం.. ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి