Summer Temperature: వేసవి అప్పుడే మండిపోతోంది. మార్చ్ నెలలోనే దేశ రాజధాని ప్రాంతంలో వేడి భారీగా పెరిగింది. మార్చ్ నెలలో ఈసారి పగటి ఉష్ణోగ్రత 77 ఏళ్ల రికార్డు బద్దలుగొడుతుందనేది వాతావరణ శాఖ అంచనా. ఆ వివరాలు తెలుసుకుందాం.
వేసవి ప్రారంభమైంది. ఇంకా మొదటి నెల మార్చ్ నడుస్తోంది. కానీ దేశ రాజధాని ఢిల్లీతో పాటు చాలా ప్రాంతాల్లో ఎండలు అదరగొట్టేస్తున్నాయి. ఉక్కపోత తీవ్రమైపోయింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో వడగాల్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత అప్పుడే 40 డిగ్రీలకు చేరువలో ఉంది. ఈ నెలాఖరులోగా ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటవచ్చని అంచనా.
ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధితో పాటు ఉత్తర భారతదేశంలో ఈసారి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువ నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా. మార్చ్ నెలలో ఉష్ణోగ్రత 77 ఏళ్ల రికార్డు బద్దలుగొడుతుందని తెలుస్తోంది. దీంతోపాటు వేసవి ఆల్ టైమ్ రికార్డు నమోదు కావచ్చు. మార్చ్‌లో ఇప్పటి వరకూ ఆల్ టైమ్ రికార్డు 1945 మార్చ్ 31 వతేదీన అత్యధికంగా 40.6 డిగ్రీలు నమోదైంది. ఈసారి అప్పుడే ఉష్ణోగ్రత 36 డిగ్రీలు దాటుతోంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగవచ్చని అంచనా ఉంది.
రాజస్థాన్‌లో ఎల్లో అలర్ట్ జారీ
రాజస్థాన్‌లోని ఎక్కువ ప్రాంతాల్లో ఇప్పటికే వేడి పెరిగిపోయింది. గత 24 గంటల్లో పగటి ఉష్ణోగ్రత రాజస్థాన్‌లో 43.4 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత అధికమైంది. రాష్ట్రంలోని బాన్స్‌వాడా, ఛిత్తౌర్‌గఢ్, ఢుంగర్‌పూర్, ప్రతాప్‌గఢ్, బికనీర్, నాగౌర్, జైసల్మేర్, జోధ్‌పూర్, బాఢ్‌మేర్ వంటి జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. అటు మధ్యప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని..పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే చాలా ఎక్కువ నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా.
Also read: Punjab New Cabinet: పంజాబ్‌లో కొత్త ఆప్ కేబినెట్ నేడే ప్రమాణ స్వీకారం, మంత్రులుగా ఎవరంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook