నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత

నిర్భయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్ కు సుప్రీంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అతను పెట్టుకున్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నిర్దిష్ట సమయానికి నిర్భయ కేసులో దోషులను అందరికీ ఉరి శిక్ష అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. 

Last Updated : Jan 29, 2020, 11:02 AM IST
నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత

నిర్భయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్ కు సుప్రీంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అతను పెట్టుకున్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నిర్దిష్ట సమయానికి నిర్భయ కేసులో దోషులను అందరికీ ఉరి శిక్ష అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. 

నిర్బయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్..  గతంలో రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ పెట్టుకున్నాడు. ఐతే అతని పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించాడు. ఆ తర్వాత నిర్భయ కేసులో దోషులుగా అప్పటికే తేల్చిన  న్యాయస్థానం . .  వారికి డెత్ వారెంట్ ఖరారు చేసింది. దీంతో వారికి ఫిబ్రవరి 1న ఉరి శిక్షలు అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు వారికి ఉన్న న్యాయ పరిమితులు ఉపయోగించుకునేందుకు కోర్టు ఓ అవకాశం ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న నిర్భయ కేసు దోషి ముఖేష్.. తీహార్ జైలులో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చాడు. దీనిపై విచారించాలని కోరుతూ . .  సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఐతే ఈ పిటిషన్ ను  త్వరితగతిన విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు కూడా అంగీకరించింది. దీనిపై ఇవాళ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం . .  ఈ పిటిషన్ ను ఎలాంటి ఆధారాలు లేవని . .   పిటిషన్ ను కొట్టేసింది. 

సుప్రీం కోర్టులో ముఖేష్ పిటిషన్ కొట్టివేయడంతో .. ఇక చివరికి మిగిలింది ఉరి శిక్ష అమలు మాత్రమేనని తెలుస్తోంది. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1న అందరు దోషులకు ఒకేసారి ఉరి శిక్ష అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. 

Trending News