ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధం - సుప్రీం సంచలన తీర్ఫు

.

Last Updated : Aug 24, 2017, 03:27 PM IST
ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధం - సుప్రీం సంచలన తీర్ఫు

ముస్లిం సమాజంలో అమలలో ఉన్న వివాదాస్పద త్రిపుల్ తలాఖ్ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్ఫు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత  ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఐదుగురు సభ్యుల బెంచ్  3:2 మెజార్టీతో త్రిపుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేసింది. త్రిపుల్ తలాఖ్ విధానంతొ ముస్లిం సమాజంలో మహిళల హక్కులకు భంగం వాటిల్లుతోందని..ఈ విధానం ఏ మాత్రం సమ్మతం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఐదుగురు సభ్యులు గల బెంచ్ లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్‌ ఖేహర్, జస్టిస్ నజీర్ మాత్రం మెజార్టీ కోర్టుతో విభేదించి ..అందుకు విదుర్ధమైన తీర్ఫు ను వెలువరించారు. త్రిపుల్ తలాఖ్ విధానం రాజ్యంగ బద్ధమేనని.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని  తీర్ఫును వెలువరించారు. ఈ విధానంపై ఆరునెలల్లోపు పార్లమెంట్ చట్టం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్ ఇచ్చిన తీర్ఫునే పరిగణనలోకి తీసుకోబడింది.

ట్రిపుల్ తలాక్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం పాటు విచారించిన సంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారిన మూడు సార్లు తలాఖ్ చెపి విడాకులు తీసుకునే త్రిపుల్ తలాఖ్ విధానంపై ఈ ఏడాది మే 11న సుప్రీంకోర్టు వాదనలు ప్రారంభించింది. ఆరురోజుల పాలు ఇరువైపుల నుంచి వాదనలు విన్న కోర్టు... ముస్లిం మహిళల అభప్రాయాలు సేకరించాలని కేంద్రానికి సూచిస్తూ తీర్ఫు ను రిజర్వ్ లో ఉంచింది. అనంతరం అభిప్రాయసేకరణ, తదనంతర వాదనలు, ప్రతివాదనలను పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్ఫును వెలువరించింది.

Trending News