Supreme Court: ప్రస్తుతం దేశద్రోహం కింద వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భారత రాజ్యాంగంలోని ఐపీసీ సెక్షన్ 124 ఎ(IPC Section 124 A). ప్రస్తుతం ఈ సెక్షన్ ప్రకారమే దేశద్రోహ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బ్రిటీషు వాళ్లు చేసిన చట్టాన్ని ఇప్పుడు కొనసాగించడం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ 124 ఏ అనేది గాంధీలాంటి సమరయోధుల్ని నిలువరించేందుకు బ్రిటీషు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమని..స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఆ చట్టం ఇంకా ఎందుకని జస్టిస్ ఎన్‌వి రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెడిషన్ లా (Sedition Law) చెల్లుబాటును పరిశీలిస్తూనే కేంద్రం నుంచి వివరణ కోరింది సుప్రీంకోర్టు.
ఐపీసీలోని సెక్షన్ 124 ఏ రాజ్యాంగ విరుద్ధమని..వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులకు విఘాతం కల్గిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబాట్కెరె సుప్రీంకోర్టు(Supreme court) లో పిటీషన్ దాఖలు చేశారు. దగీనిపై విచారణ సందర్బంగా జస్టిస్ ఎన్‌వి రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇలాంటి పిటీషన్లు చాలా దాఖలయ్యాయని..అన్నింటినీ ఒకేసారి విచారిస్తామని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదొక ప్రమాదకర అంశమని..బాధ్యతారాహిత్యంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Supreme court chief justice nv ramana) తెలిపారు.
Also read: Nandigram Election: నందిగ్రామ్ ఎన్నికలపై మమతా బెనర్జీ పిటీషన్ విచారణ ఆగస్టు 12వ తేదీన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook