IIT-JEE Exams: వాయిదా ప్రసక్తే లేదు...తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఐఐటీ- జేఈఈ పరీక్షల్ని నిర్వహించాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పరీక్షల వాయిదా కోరుతూ ఆరు రాష్ట్రాల రివ్యూ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. 

Last Updated : Sep 4, 2020, 04:45 PM IST
IIT-JEE Exams: వాయిదా ప్రసక్తే లేదు...తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఐఐటీ- జేఈఈ ( IIT-JEE Exams ) పరీక్షల్ని నిర్వహించాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పరీక్షల వాయిదా కోరుతూ ఆరు రాష్ట్రాల రివ్యూ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. 

దేశంలోని అత్యున్నత పరీక్షలుగా భావించే ఐఐటీ- జేఈఈ పరీక్షలపై ,సుప్రీంకోర్టు ( Supreme court ) తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో పరీక్షల్ని వాయిదా వేయాలంటూ ఆగస్టు 28న 6 రాష్ట్రాలు సంయుక్తంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాయి.  ఇదే విషయమై గతంలో దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు ఆగస్టు 17వ తేదీన కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి  బీజేపీయేతర  రాష్ట్రాలు పరీక్షల వాయిదా కోరుతూ వేసిన పిటీషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని..వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పశ్చిమబెంగాల్, జార్ఘండ్, రాజస్తాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు పరీక్షల వాయిదా కోరుతూ పిటీషన్ దాఖలు చేశాయి.  Also read: DK Shivakumar: మళ్లీ ఆసుపత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు

Trending News