గాల్వన్ లోయలో చైనాతో ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులు కావడంతో దేశంలో మరోసారి చైనాపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ సోమవారం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత, ఎంపీ మాణిక్కమ్ ఠాగూర్ పేటీఎం (Paytm App) ను తక్షణమే నిషేధించాలని డిమాంట్ చేసి నవ్వులపాలవుతున్నారు.
చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించినట్లు తెలిపారు. అయితే ఈ కామర్స్ మొబైల్ యాప్ పేటీఎంలో చైనాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్స్, అలీబాబా గ్రూపులు వరుసగా 29.71శాతం, 7.18శాతం పెట్టుబడులు పెట్టాయని, ఇలాంటి వాటిని నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
I welcome the government’s bold move to ban some #ChineseAppsBanned ,Now Narendra should show his 56” chest and ban #Paytm, which has massive Chinese investments. Time to put your money where your mouth is! #GoVocalForLocal pic.twitter.com/SwWTcCg6tH
— Manickam Tagore MP🇮🇳✋மாணிக்கம் தாகூர் (@manickamtagore) June 29, 2020
‘ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న. అయితే చైనా నుంచి అధికంగా పెట్టుబడులు కలిగి ఉన్న పేటీఎం యాప్‌ను నిషేధించి ప్రధాని నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని, దైర్యాన్ని ప్రదర్శించాలి. మీరేమో ‘గో వోకల్ ఫర్ లోకల్’ #GoVocalForLocal అంటున్నారు కానీ, పెట్టుబడులు ఎలా వస్తున్నాయంటూ’ ఎంపీ మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. పేటీఎం అనేది దేశానికి చెందిన యాప్ అని, ఇందులో పెట్టుబడుల కోసం మన వాళ్లను అడగాలా.. ఇలాంటి చేయవద్దని సూచిస్తూ నెటిజన్లు ట్వీట్ల ద్వారా స్పందిస్తున్నారు. పేటీఎం అనేది చైనా యాప్ కాదని, భారత్‌కు చెందిన యాప్ అని తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు.
Paytm is local.... Ask Indians to invest into this.... Don't trend anything 🤦🤦 pic.twitter.com/wPxPb3OSyV
— Sweta. (@Sweta______) June 29, 2020
కాగా, కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, వి చాట్, హెలో లాంటి మొత్తం చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత్‌లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. యాప్స్ వివరాలు వెల్లడించింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ