Ayodhya: "మూడు రాష్ట్రాల గుండా జర్నీ..".. అయోధ్యకు చేరుకున్న ముస్లిం మహిళ చేసిన వ్యాఖ్యలివే..

Ram lalla Darshan: బురఖా ధరించిన షబ్నమ్ షేక్ అనే మహిళ అయోధ్యకు వెళ్తుండగా అమేథీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే అర్షద్ అనే వ్యక్తి కారులో ఆమె వద్దకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ మహిళ ఆరోపించింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Jan 31, 2024, 11:50 AM IST
  • - మతసామరస్యాన్ని చాటి ముస్లిం మహిళ..
    - బురఖా ధరించి కాలినడకన అయోధ్యకు..
    - ముస్లిం మతపెద్దలకు ప్రాబ్లమ్ ఉంటే నాతో మాట్లాడాలి..
Ayodhya: "మూడు రాష్ట్రాల గుండా జర్నీ..".. అయోధ్యకు చేరుకున్న ముస్లిం మహిళ చేసిన వ్యాఖ్యలివే..

Muslim Women Reaches Ayodhya: అయోధ్య రామమందిరంలో ప్రతిష్టాపన చేసిన బాల రాముడిని కులమతాలకు అతీతంగా దర్శించుకుంటున్నారు. రామ్ లల్లాను ప్రతిష్టాపనకు కూడా అయోధ్య రామమందిరం ట్రస్ట్ అన్ని వర్గాలకు చెందిన సామాన్య వర్గాల నుంచి వీఐపీల వరకు అందరిని ఆహ్వానించింది.

ఇదిలా ఉండగా అయోధ్య రామ్ లల్లాకు మతసామరస్యం చాటేలా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రతిష్టాపన మహోత్సానికి వచ్చి కానుకలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా.. బాంబె నుంచి ఒక షబ్నమ్ షేక్ అనే  ముస్లిం మహిళ బురఖా ధరించి మరీ అయోధ్య రాముడి దర్శనానికి వచ్చి అందరిని ఆశ్యర్యపరిచింది.

పూర్తి వివరాలు..

 మహరాష్ట్రలోని ముంబైకు చెందిన షబ్నమ్ షేక్ అనే మహిళ బురఖా ధరించి అయోధ్య రామాలయంకు చేరుకుంది. ఈ క్రమంలో ఆమెను మీడియా పలకరించింది. ఈ క్రమంలో షబ్నమ్ షేక్ మాట్లాడుతూ.. తాను మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మూడు రాష్ట్రాల గుండా నడుస్తూ రామ్ లల్లా ఆలయానికి వచ్చానని తెలిపింది. అంతే కాకుండా.. తాను సనాతన ధర్మం పాటించే ముస్లింనని కూడా చెప్పింది. చిన్ననాటి నుంచి మతసామరస్యం పాటిస్తు అన్ని వర్గాల వారి పండుగలలో కూడా పాల్గొంటానని మహిళ చెప్పింది. అందరి దేవుళ్లు, ధర్మాలను గౌరవిస్తానని తెలిపింది.

ఈ క్రమంలో అమేథీలో షబ్నక్ కు చెదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.  స్థానికంగా...  అర్షద్ అనే వ్యక్తి తనతో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడని షబ్నమ్, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న వారు ఆరోపించారు. పవిత్రమైన దేవాలయానికి బురఖా ధరించి వెళ్తున్నావని వ్యాఖ్యలు చేశాడని ఆమె తెలిపింది. దీంతో మహిళ ఫిర్యాదు మేరుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.

శ్రీరాముడి పట్ల తనకున్న భక్తిని వివరిస్తూ, తాను చిన్నప్పటి నుంచి అన్ని హిందూ పండుగల్లో పాల్గొంటున్నానని, రాముడిపై తనకు నమ్మకం ఉందని షబ్నమ్ చెప్పారు. “నేను భారతీయ సనాతన ముస్లిం నని,  అన్ని హిందువుల పండుగల్లో పాల్గొన్నానని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

"దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కానీ ఫత్వా ద్వారా కాదని షబ్నమ్ అన్నారు. ఎవరైనా మౌలానాకు నాతో ఏదైనా సమస్య ఉంటే, అతను నేరుగా నాతో మాట్లాడవచ్చు. వారికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నట్లు ఆమె పేరొన్నారు.

అంతకుముందు అమేథీ జిల్లా రాణిగంజ్‌లో ఆమెకు రామభక్తులు ఘనస్వాగతం పలికారు. ఆమెపై పూల వర్షం కురిపించి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 22న అయోధ్య ప్రారంభోత్సవానికి హజరైన ముస్లించీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్ యాసీకి ముస్లిం సంస్థలు ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే.

Read Also: Highcourt: పెళ్లైన మహిళలకు బిగ్ షాక్.. వేరు కాపురం పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News