Tata Consultancy Services latest Jobs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. టీసీఎస్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌ను నిర్వహిస్తోంది. ఇంజనీర్లు, ఎంసీఎ, ఎమ్మెస్సీ డిగ్రీ హోల్డర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
టీసీఎస్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌లో పాల్గొనాలంటే ఈ అర్హతలుండాలి. 2019, 2020 లేదా 2021లో ఉత్తీర్ణత సాధించిన బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, తదితర డిగ్రీ హోల్డర్లు ఈ నియామకానికి అర్హులు.
పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లలో అభ్యర్థులు తప్పనిసరిగా 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 28 సంవత్సరాల వయసు వారై ఉండాలి. కనీసం 6 నుంచి 12 నెలల ఐటీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ ఎంపిక విధానం రెండు రౌండ్లలో జరుగుతుంది. మొదట రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో అభ్యర్థులు చూపించే ప్రతిభ ఆధారంగా, ఇంటర్వ్యూ కోసం అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఇక రాత పరీక్ష మూడు భాగాల్లో జరుగుతుంది. పార్ట్ 1లో అభ్యర్థుల అడ్వాన్స్‌డ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. పార్ట్ 2, పార్ట్ 3లలో అభ్యర్థుల వెర్బల్ ఎబిలిటీ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ కోడింగ్ స్కిల్స్‌ను చెక్ చేస్తారు.
నియామక ప్రక్రియ అంతా డిజిటల్ విధానంలోనే సాగుతుంది. ఇక ఫలితాలను టీసీఎస్ iON ద్వారా ప్రకటిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సంబంధించిన డిటేల్స్ పంపిస్తారు. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే ఇక జాబ్ కన్ఫర్మ్ అయినట్లు అవుతుంది. ఇక ప్యాకేజీ విషయానికి వస్తే.. యూజీ డిగ్రీ హోల్డర్లకు ఏడాదికి 7 లక్షల రూపాయల ప్యాకేజీ ఉంటుంది. పీజీ డిగ్రీ హోల్డర్లకు అయితే సంవత్సరానికి 7.3 లక్షల ప్యాకేజీ ఉంటుంది.
టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు టీసీఎస్ నెక్స్ట్‌స్టెప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. డిజిటల్ డ్రైవ్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే ఈ ప్రక్రియలు పూర్తి చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2022గా నిర్ణయించారు.
ఇక రాత పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలుంటే టీసీఎస్ హెల్ప్‌డెస్క్ టీమ్‌కు ilp.support@tcs.com మెయిల్ చేయవచ్చు. అలాగే 18002093111 హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చు. టీసీఎస్ అఫీషియల్ వెబ్‌సైట్ సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: Viral Photo: పుష్ప రాజ్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్స్.. ఎవరు బాగా సెట్ అయ్యారంటే?
Also Read: India Corona Cases Today: దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు, మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook