తెలంగాణలో పరిస్థితిని కేంద్రానికి వివరించిన గవర్నర్

తెలంగాణలో పరిస్థితిని కేంద్రానికి వివరించిన గవర్నర్

Updated: Oct 16, 2019, 12:10 AM IST
తెలంగాణలో పరిస్థితిని కేంద్రానికి వివరించిన గవర్నర్
Source : ANI

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో తమిళిసై భేటీ అవడం ఇదే తొలిసారి. దాదాపు అరగంట పాటు మోదీతో భేటీ అయిన గవర్నర్.. దేశం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో గత 11 రోజులుగా జరుగుతున్న టీఎస్ఆర్టీసి సమ్మె గురించి, సమ్మె అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల గురించి వివరించారు.  

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. తెలంగాణలో సమ్మె తర్వాతి పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, శాంతి భద్రతలు వంటి అంశాలు చర్చకొచ్చినట్టు తెలిసింది.