Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు విశేష స్పందన..రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్..!

Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకానికి మద్దతు లభిస్తోంది. ఈపథకం ద్వారా వచ్చిన తొలి నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 6, 2022, 07:50 PM IST
  • అగ్నిపథ్‌కు విశేష స్పందన
  • రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు
  • ఐఏఎఫ్‌ నుంచి తొలి నోటిఫికేషన్
Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు విశేష స్పందన..రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్..!

Agnipath Recruitment Scheme-2022: త్రివిధ దళాల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకం తీసుకొచ్చింది. అగ్నివీరులను అగ్నిపథ్‌ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఈపథకం నుంచి ఐఏఎఫ్‌(IAF) తొలి నోటిఫికేషన్‌ వచ్చింది. నేటితో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 7 లక్షల 49 వేల 899 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్నిపథ్‌లో చేరేందుకు యువత ఆసక్తి చూపింది.

గతంలో 6 లక్షల 31 వేల 528 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ రికార్డును తిరగరాస్తూ ఈసారి అత్యధిక మంది అగ్నివీరుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సైన్యంలో యువకులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై పెను దుమారం రేగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అగ్నిజ్వాలలు చెలరేగాయి. చాలా రైల్వే స్టేషన్లలో రైళ్లను తగలబెట్టారు. సికింద్రాబాద్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మంటలు చెలరేగాయి.

ఐనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అగ్నిపథ్‌ ద్వారానే రిక్రూట్‌మెంట్ జరుగుతుందని స్పష్టం చేసింది. త్రివిధ దళాలతో పలుమార్లు ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అగ్నిపథ్‌కే కట్టుబడి ఉన్నామని త్రివిధ దళాల అధికారులు స్పష్టం చేశారు. ఈక్రమంలో ఇటీవల ఐఏఎఫ్‌(IAF) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టింది. నేటితో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. త్వరలో పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 

Also read:CM Jagan Tour: కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..టూర్ షెడ్యూల్ ఇదే..!

Also read:Booster Dose: దేశంలో కరోనా ఉధృతి..కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News