భగ్గుమన్న బంగారం.. 10 రోజుల గరిష్టానికి బంగారం, వెండి ధరలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్‌ విధించినా బంగారం ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో బంగారం ధరలు పుంజుకున్నాయి.

Updated: Mar 27, 2020, 07:51 AM IST
భగ్గుమన్న బంగారం.. 10 రోజుల గరిష్టానికి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్‌ విధించినా బంగారం ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. జ్యువెలర్ల విక్రయాలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో నేటి (మార్చి 26న) బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పుంజుకున్నాయి. వెండి సైతం బంగారాన్ని అనుసరించింది. Also Read: లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే

24 carat Gold Silver price in Andhra Pradesh

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో బంగారం ధర రూ.1,010 పెరిగింది.  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,630కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.1,007 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,080కి జంప్ అయింది. గత పదిరోజుల గరిష్ట ధరకు బంగారం చేరుకోవడం గమనార్హం.  Must Read: యాంటీ బయాటిక్స్‌తో కరోనాకు చెక్.. అసలు నిజం ఇది

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగానే  పెరిగింది. బంగారం ధర రూ.1,010 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,070కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,870కి జంప్ అయింది. Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

కాగా, బంగారం ధరలు పెరగగా వెండి సైతం పసిడినే అనుసరించింది.  బులియన్ మార్కెట్‌లో బుధవారం 1 కేజీ వెండి రూ.790 మేర పెరిగింది. దీంతో 1కేజీ వెండి ధర రూ.41,810 అయింది. వెండి సైతం గత 10 రోజుల గరిష్ట ధరను నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.41,810కి జంప్ అయింది.  కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి             జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos