త్రిపుల్ తలాక్‌ ఆర్డినెన్స్‌పై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

త్రిపుల్ తలాక్‌ ఆర్డినెన్స్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందన

Last Updated : Sep 20, 2018, 11:03 AM IST
త్రిపుల్ తలాక్‌ ఆర్డినెన్స్‌పై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

త్రిపుల్ తలాక్‌పై కేంద్ర కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధం అని చెబుతూ.. రాజ్యాంగంలోని సమానత్వం హక్కుని ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘించిందని ఓవైసీ అన్నారు. ఇస్లాం చట్టాల ప్రకారం వివాహం అనేది ఓ పౌర ఒప్పందం వంటిది. ఇస్లాం వివాహ వ్యవస్థ మధ్యలోకి జరిమానా సంబంధిత అంశాలను చొప్పించడం సరైంది కాదు. ఈ ఆర్డినెన్స్ వల్ల ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ముస్లిం మహిళలకు ఎటువంటి న్యాయం చేయని ఈ ఆర్డినెన్స్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, మహిళా సంఘాలు సుప్రీం కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఓవైసీ అభిప్రాయపడ్డారు. 

త్రిపుల్ తలాక్‌ని శిక్షించదగిన నేరం కింద పరిగణిస్తూ ఇవాళ మధ్యాహ్నం కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Trending News