Truck Hits 12 Cars, Wreckage Video Goes Viral: ట్రక్కు బ్రేక్స్ ఫెయిలైన కారణంగా 12 కార్లు తుక్కు తుక్కు అయిన ఘటన ఇది. ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్‌వే పై కోపోలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన ట్రక్కు వాహనాలపైకి దూసుకుపోయింది. ఈ క్రమంలో ట్రక్కు 12 వాహనాలను ఢీకొంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొనడంతో 12 కార్లు తుక్కుతుక్కయ్యాయి. ట్రక్కు ఢీకొన్న వేగానికి దాదాపు ఏడెనిమిది కార్లు ఒకదానినొకటి అంతే బలంగా ఢీకొన్నాయి. ఈ కారణంగానే ప్రమాదం తీవ్రత పెరిగింది. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ నలుగురికి గాయాలయ్యాయి.
ఈ ఘటనను చూసిన ప్రత్యక్షసాక్షులు, బాధితులు.. 12 కార్లు తుక్కు తుక్కు అవడంతో ప్రమాదం తీవ్రత భారీగా ఉంటుందని భయాందోళనకు గురయ్యారు. కానీ అదృష్టవశాత్తుగా నలుగురికి కొద్దిపాటి స్వల్ప గాయాలు మినహా.. మిగతా వాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని కూడా చికిత్స నిమిత్తం వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Collision of 7 vehicles on Mumbai-Pune Expressway at Khopoli, four people injured#Maharashtra pic.twitter.com/lIIuClOERx
— ANI (@ANI) April 27, 2023
మహారాష్ట్రలోని ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుండటంతో తరచుగా ఈ రహదారి రక్తమోడుతోంది. ఒకటి మర్చిపోకముందే మరొకటి అన్నట్టుగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల ఆరంభంలోనే ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్‌వే పై నిలిపి ఉన్న స్టేషనరి ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తొలుత రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ని ఢీకొన్న కారు.. అక్కడి నుంచి అదుపుతప్పి వెళ్లి రోడ్డు పక్కన నిలిపి ఉన్న స్టేషనరి ట్రక్కును ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు.