Activist Trupti Desai barred entering Shirdi: పూణె: షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ( Trupti Desai ) పై తాత్కాలిక నిషేధం విధించారు. మహారాష్ట్రలోని బాబా మందిర ప్రాంతమైన షిర్డీ ( Shirdi ) పరిధిలోకి ఈనెల 8 నుంచి 11న అర్ధరాత్రి వరకు ప్రవేశించరాదంటూ షిర్డీ ఏరియా సబ్-డివిజనల్ కార్యాలయం ( Shirdi Sub Divisional Office ) మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. శాంతి, భద్రతల పరిరక్షణ దృష్ట్యా డిసెంబరు 11వ తేదీ వరకు షిర్డీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ప్రవేశించరాదంటూ సబ్ డివిజనల్ కార్యాలయం తృప్తి దేశాయ్‌కు సూచించింది. ఒకవేళ ఆమె ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Also read: Shirdi Sai Baba Temple: సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే బాబా దర్శనం
Earlier, Desai had objected to the posters put in the premises of Shri Saibaba Temple Shirdi requesting the "devotees to wear traditional Indian or civilised attire" in the temple premises
(file pic) https://t.co/b4IeubwcnE— ANI (@ANI) December 8, 2020
ఇదిలాఉంటే.. షిర్డీ సాయి బాబా ( Shirdi Sai Baba ) దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి మందిరం లోపలికి ప్రవేశించాలని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ( Shri Saibaba Sansthan Trust ).. ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే భక్తుల వస్త్రధారణ మంచిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ షిర్డీ ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన బోర్డులను తొలగిస్తానంటూ తృప్తి దేశాయ్ ఇటీవల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శాంతి, భద్రతల పరిరక్షణ దృష్ట్యా మెజిస్ట్రేట్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. Also read: Farmer protests: ఎటూ తేలని చర్చలు.. నేటి భేటీ రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe