Farmers call off protests: ఉద్యమం వీడిన అన్నదాత- ఏడాది తర్వాత ఇంటి బాట!

ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులు ఎట్టకేలకు ఉద్యమం వీడేందుకు (Delhi Farmers agitation) సిద్ధమయ్యారు. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించిన కారణంగానే.. రైతులు ఆందోళన విరమించాలని (Govt agreed Farmers Demands) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 05:15 PM IST
  • ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమించిన రైతులు
  • కేంద్రం హామీతో నిర్ణయం తీసుకున్న రైతు సంఘాలు
  • ఏడాది తర్వాత ఢిల్లీని వీడుతున్న అన్నదాతలు
Farmers call off protests: ఉద్యమం వీడిన అన్నదాత- ఏడాది తర్వాత ఇంటి బాట!

Farmers call off agitation at Delhi borde: ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులు ఎట్టకేలకు ఉద్యమం వీడేందుకు (Delhi Farmers agitation) సిద్ధమయ్యారు. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించిన కారణంగానే.. రైతులు ఆందోళన విరమించాలని (Govt agreed Farmers Demands) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమిస్తున్నట్లు సంయుక్త కిసాన్​ మోర్చ (Farmers protests End) వెల్లడించింది. రెండు రోజుల్లో ఢిల్లీ సరిహద్దులను పూర్తిరగా ఖాళీ చేస్తామని ప్రకటించింది.

ప్రభుత్వం హామీ ఇలా..

గత ఏడాది తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల రద్దు (New Farm Laws) ప్రధాన డిమాండ్​గా రైతులు గత ఏడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతులు.. ఆందోళనలు కొనసాగించడం చూసి కేంద్రం దిగొచ్చింది. రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా గత నెలలో ప్రకటించారు.

తొలిరోజే పార్లమెంట్​ ముందుకు..

చెప్పినట్లుగానే.. పార్లమెంట్ శీతాకాల సమావేశం మొదటి రోజునే ఈ బిల్లు ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. పార్లమెంట్​ ఆమోదం పొందటం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం అన్ని చక చకా జరిగిపోయాయి.

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రైతు సంఘాలు.. ఇతర డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని తేల్చి చెప్పాయి.

తాజాగా ఇందుకు సంబంధించి కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) చట్టంగా మార్చే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో (Govt on MSP) పేర్కొంది. దీనితో పాటు ఉద్యమం సమయంలో రైతులపై నమోదు చేసిన కేసులను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా (Govt lift cases on Farmers) పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఉద్యమాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆందోళనల్లో ఘర్షణల కారణంగా మృతి చెందిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై ఉత్తర్​ ప్రదేశ్​, హరియాణా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి.

అయితే ఢిల్లీని వీడినప్పటికీ.. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతాయని (Delhi farmers protest updates) స్పష్టం చేశారు రైతు సంఘాల నేతలు.

Also read: Group Captain Varun Singh : హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ఒక్కడు..ధైర్య సాహాసాలకు కేరాఫ్ అడ్రస్

Also read: Mi-17 chopper crash: హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్​లో రాజ్​నాథ్​ సింగ్ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News