West Bengal: రాజీనామా చేసిన ఇద్దరు బీజేపీ ఎంపీలు, కారణం ఏంటి

West Bengal: దేశంలో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించింది నెరవేరలేదు. వరుసగా మూడోసారి టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో అక్కడి బీజేపీ ఎంపీలు రాజీరామాలు సమర్పించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 13, 2021, 09:45 AM IST
West Bengal: రాజీనామా చేసిన ఇద్దరు బీజేపీ ఎంపీలు, కారణం ఏంటి

West Bengal: దేశంలో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించింది నెరవేరలేదు. వరుసగా మూడోసారి టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో అక్కడి బీజేపీ ఎంపీలు రాజీరామాలు సమర్పించారు.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో(West Bengal Assembly Elections) టీఎంసీ (TMC) ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ(Bjp)..చాలామంది ఎంపీల్ని అసెంబ్లీ బరిలో దింపింది. ఇందులో కొందరు ఓటమి పాలవగా మరికొందరు గెలిచారు. అయితే బీజేపీ అనుకున్న అధికార పీఠం కోరిక మాత్రం నెరవేరలేదు.ఈ క్రమంలో రాణాఘాట్ ఎంపీ జగన్నాథ్ సర్కార్, కూచ్ బిహార్ ఎంపీ నిసిత్ ప్రామాణిక్‌లు విజయం సాధించగా..బబూల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ, స్వపన్ దాస్ గుప్తాలు ఓటమి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీ లక్ష్యం నెరవేరకపోవడంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆ ఇద్దరు ఎంపీలు జగన్నాధ్ సర్కార్, నిసిత్ ప్రామాణిక్‌లు ఎంపీలుగా కొనసాగడానికి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేశారు. స్పీకర్ బిమన్ బెనర్జీకు తమ రాజీనామాలు సమర్పించారు. 

Also read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News