చిన్నారులను రోడ్ల మీద, చెత్తకుండీల్లో పడేసి వెళ్లడం వంటి హృదయ విషాదకర దృశ్యాలను ఇటీవలి కాలంలో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్దామా మరి...
యూపీలోని ముజప్ఫర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పడే పుట్టిన పసికందును ఓ ఇంటి మెట్లపై వదిలేసి కారులో వెళ్లిపోయింది ఓ యువతి. దృశ్యం సిసి కెమెరా ఫూటేజీలో రికార్డు అయింది. కాగా పాప ఏడుపు శబ్దం విన్న స్థానికులు .. దగ్గరకు వచ్చి దృశ్యన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. వెంటనే వైద్య అధికారులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలికి చేరుకొన్న వైద్య అధికారులు.. ఆ చిన్నారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు ఘటనపై విచారణ జరపుతున్నారు. కన్నీరు తెప్పించే హృదయ విషాదకర దృశ్యాన్ని మీరు చూడండి.
#WATCH An unidentified woman drops a new-born baby on a street from a car in Muzaffarnagar. CMO Muzaffarnagar says, "the new-born is under treatment but her condition remains critical. We are hopeful of her recovery." (Source:CCTV footage) pic.twitter.com/Q6gyEAo6Q6
— ANI UP (@ANINewsUP) June 6, 2018
ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఇలా పసికందును వదిలి వెళ్లడం కసాయితనం కాకపోతే మరేమౌతుంది. కాగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలనే ప్రజా సంఘాల నుండి డిమాండ్ వినిపిస్తుంది.