Union Cabinet Meet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, గ్రామాల్లో ఇక ఇంటర్నెట్ సేవలు

Union Cabinet Meet: కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఉద్దీపన ప్యాకేజ్‌కు కేబినెట్ ఆమోదం తెలుపగా..పవర్ డిస్కం పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 30, 2021, 05:19 PM IST
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలు
  • 3.03 లక్షల కోట్లతో డిస్కం పధకం ప్రారంభం
  • ఉద్దీపన ప్యాకేజికు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
Union Cabinet Meet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, గ్రామాల్లో ఇక ఇంటర్నెట్ సేవలు

Union Cabinet Meet: కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఉద్దీపన ప్యాకేజ్‌కు కేబినెట్ ఆమోదం తెలుపగా..పవర్ డిస్కం పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi)అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. వర్చువల్ విధానంలో సాగిన మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman)రెండ్రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌కు కేబినెట్ ఆమోదం ప్రకటించింది.ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని ఆమోదించారు. అదే విధంగా 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ ఆధారిత, ఫలిత అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 

మరోవైపు దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో(Internet in Villages) బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భారత్ నెట్ (Bharat Net)ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 19 వేల 41 కోట్ల నిధులతో కేబినెట్ ఆమోదించింది. పవర్ డిస్కం సంస్కరణలు, బలోపేతానికి భారీగా ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిస్కంల సామర్ధ్యం, పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఆర్ధిక తోడ్పాటు ఇవ్వనున్నారు. ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరిస్తేనే పెద్ద ఎత్తున డిస్కంలకు ఆర్ధిక సహాయం అందనుంది. పవర్ డిస్కం పథకానికి 97 వేల 631 కోట్లు కేటాయించింది కేబినెట్ (Union Cabinet). 

Also read: Jammu kashmir Encounter: జమ్ములో భద్రతాబలగాల కూంబింగ్ ఆపరేషన్, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News