Govt Employees will get 42days Special Leave: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు చర్చ జరుగుతుండగా.. మరో గుడ్‌న్యూస్ అందింది. కేంద్ర ప్రభుతం ఇటీవలె కొత్త సెలవు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద గతంలో కంటే ఎక్కువ సెలవులు లభించనున్నాయి. కొత్త లీవ్ పాలసీ ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించగా.. ఉద్యోగులకు ఎప్పుడు.. ఎన్ని రోజులు సెలవులు పొందవచ్చో తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ లీవ్స్‌ను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకునేందుకు వీలులేదు.
కేంద్ర ఉద్యోగి ఏదైనా అవయవాన్ని దానం చేసిన సమయంలో.. 42 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ సౌకర్యం వాడుకోవచ్చు. డీఓపీటీ తరపున అధికారిక మెమోరాండం జారీ చేసి సమాచారం అందజేస్తారు. ఒక ఉద్యోగి శరీరంలోని ఏదైనా భాగాన్ని దానం చేస్తే.. అది అతిపెద్ద శస్త్రచికిత్సగా పరిగణిస్తారు. ఈ తరహా సర్జరీకి చాలా సమయం పడుతుంది. అవయవ దానం చేసిన తరువాత రికవరీకి కూడా సమయం పడుతుంది. అందుకే 42 రోజుల స్పెషల్ సెలవుల నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చింది. కేంద్ర ఉద్యోగులలో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 42 రోజుల ప్రత్యేక సెలవు పాలసీని తీసుకువచ్చింది. ఇందుకోసం రూల్స్ కూడా ఫిక్స్ చేసింది.
Also Read: MLA Anil Kumar Yadav: సంచలన పరిణామం.. ఆ 18 మందిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు..?
ప్రత్యేక సెలవులు కాకుండా.. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఏ క్యాలెండర్ ఇయర్‌లో అయినా క్యాజువల్ లీవ్ రూపంలో 30 రోజుల సెలవులు పొందవచ్చు. కొత్త లీవ్ పాలసీ నిబంధనలు ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి వచ్చాయి. స్పెషల్ లీవ్స్ గురించి డీఓపీటీ జారీ చేసిన మెమోరాండంలో సమాచారం ఇచ్చింది. సీసీఎస్ నిబంధన ప్రకారం ఈ ఆర్డర్ వర్తించదు. ఎంపిక చేసిన కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. రైల్వే ఉద్యోగులు, అఖిల భారత సర్వీసుల ఉద్యోగులకు ఈ ఆర్డర్ వర్తించదని ప్రభుత్వం పేర్కొంది.
Also Read: World Cup 2023 Schedule: వరల్డ్ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook