యూపీ: ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో కేంద్ర ఆరోగ్య, కుంటుంబ సంక్షేమశాఖ మంత్రి అనుప్రియ పటేల్ కు చేధు అనుభవం ఎదురైంది. కొందరు ఆకతాయిలు ఆమె కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన వారణాసిలోని మిర్జామురాద్ సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లినట్లయితే కేంద్ర మంత్రి అనుప్రియ సోమవారం రాత్రి వారణాసిలో జరిగిన పార్టీ కార్యక్రమాన్ని ముగించుకొని తన సొంత నియోజకవర్గమైన మిర్జాపూర్ కు తన కాన్వాయ్ లో బయల్దేరారు. ఇంతలో అటువైపు నెంబర్ ప్లేట్ లేని కారులో వెళ్తున్న ముగ్గురు ఆకతాయిలు ఆమె కాన్వాయ్ ను వెంబడించారు. కాన్వాయ్ ను ఓవర్ ట్రాక్ చేస్తూ హచ్ చల్ చేశారు. దీంతో ఊరుకోకుండా.. కేంద్ర మంత్రితో ఉన్న సిబ్బందిపై వ్యక్తిగత దూషణలకు దిగారు..కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వారణాసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి ఫిర్యాదు మేరకు మిర్జామురాద్ పోలీసులు నిందిుతులను ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు.
మోడీ నియోజకర్గంలో ఈవ్ టీజంగ్ !
యోగి ఆదిత్య నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కేంద్ర మంత్రికి ఇలా ఈవ్ టీజింగ్ జరగడం గమనార్హం. ఎందుకంటే ఆయన ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇచ్చే అంశాల్లో మహిళా భద్రత, ఈవ్ టీజింగ్ నిర్మూలన. అలాంటిది కేంద్ర మంత్రికే భద్రత లేకుండా పోయిందంటే ప్రభుత్వం సామన్య మహిళలకు ఎలా రక్షణ ఇవ్వగలదనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది... కాగా తాజా ఘటనతో పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గమనించదగ్గ విషయం ఏమింటంటే ప్రధాని మోడీ సొంత నియోజకర్గం వారణాసిలో ఈ ఘటన చోటు చేసుకోడం.
మరో కేంద్ర మంత్రికి ఇదే అనుభవం
ఇదిలా ఉండగా మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకీ ఏప్రిల్ 2017 లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లుండగా నలుగురు ఢిల్లీ వర్శిటీ విద్యార్ధులు ఆమెను ఈవ్ టీజింగ్ చేశారు. ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేయడం నిందితులను అరెస్ట్ చేయడం. మళ్లీ వారు బెయిల్ పై విడదల అవడం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు కేస్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఏకంగా కేంద్ర మంత్రిపై జరిగిన ఆ ఈవ్ టీజింగ్ కేసు కూడా నీరుగారింది.
మహిళలైన కేంద్ర మంత్రులకే రక్షణ లేని ఇలాంటి పాలనలో ఇక సామాన్య మహిళలకు భద్రత ఎలా సాధ్యమవుతుందనేప్రశ్నఇక్కడ ఉత్పన్నమౌతుంది...కాగా సాక్షాత్తుగా ప్రధాని మోడీ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాల చేతికి వెపన్ దొరినట్లయింది. ఇదే అంశాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసేందుకు వైరి పక్షాలు సిద్ధమవుతున్నాయి.