UPSC Rankers Dispute: ఒకే హాల్ టికెట్, ఒకటే ర్యాంకు..అమ్మాయిలు మాత్రం ఇద్దరు, అసలు ర్యాంకర్ ఎవరు

UPSC Rankers Dispute: యూపీఎస్ సి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో మాత్రం ఒక ర్యాంక్ విషయంలో ఇద్దరు అమ్మాయిల మధ్య వివాదం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2023, 07:52 PM IST
UPSC Rankers Dispute: ఒకే హాల్ టికెట్, ఒకటే ర్యాంకు..అమ్మాయిలు మాత్రం ఇద్దరు, అసలు ర్యాంకర్ ఎవరు

UPSC Rankers Dispute: దేశంలోని అత్యున్నత యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు మధ్యప్రదేశ్‌లో వివాదానికి కారణమయ్యాయి. దేశంలో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సి ఇక్కడ మాత్రం ఒక ర్యాంకు కోసం ఇద్దరమ్మాయిలు పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చింది. అసలేం జరిగింది..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫలితాల అనంతరం ఎంపికైన అభ్యర్ధుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల అనంతరం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఎక్కడికక్కడ ర్యాంకర్ల ఇళ్లలో సంబరాలు జరుగుతున్నాయి. ఈ లోగా మద్యప్రదేశ్ నుంచి అందర్నీ షాక్‌కు గురి చేసే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకటే రోల్ నెంబర్‌పై ఇద్దరు అమ్మాయిలు ర్యాంకు తమదంటే తమదనే వివాదానికి దిగారు. 184వ ర్యాంకు విషయమై జరిగిన వివాదమిది. ఒకరు ఆయేషా ఫాతిమా కాగా మరొకరు ఆయేషా మక్రానీ. 

ఇద్దరి పేర్లు ఆయేషానే. ఒకరు ఆయేషా ఫాతిమా అయితే మరొకరు ఆయేషా మక్రానీ. ఇద్దరూ 184వ ర్యాంకు వచ్చినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరిలో ఆయేషా ఫాతిమా దేవాస్‌‌కు చెందినవారు కాగా, ఆయేషా మక్రానీ అలీ రాజ్‌పూర్‌కు చెందిన అమ్మాయి. వివాదం పెరిగి పెద్దదైంది. ఇద్దరి అడ్మిట్ కార్డులపై హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఉంది. రెండు అడ్మిట్ కార్డులను పరిశీలించి చూడగా, ఆయేషా మక్రానీ అడ్మిట్ కార్డుపై చాలా తప్పులు కన్పించాయి. ముఖ్యంగా వాటర్ మార్క్ లేదు. అడ్మిట్ కార్డుపై ఉండాల్సిన క్యూఆర్ కోడ్ లేదు. అదే ఆయేషా ఫాతిమా అడ్మిట్ కార్జుపై వాటర్ మార్క్, క్యూఆర్ కోడ్ రెండూ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆయేషా ఫాతిమా వివరాలన్నీ బయటికొస్తాయి.

అడ్మిట్ కార్డులో మరో తప్పు

ఆయేషా మక్రానీ అడ్మట్ కార్డుపై ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 25, గురువారం అని ఉంది. అటు ఆయేషా ఫాతిమా అడ్మిట్ కార్డుపై ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 25 మంగళవారం అని ఉంది. వాస్తవానికి ఇంటర్వ్యూ జరిగింది కూడా మంగళవారమే. ఈ క్రమంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తేలడం లేదు. నిజంగా యూపీఎస్సీ నుంచి తప్పు జరిగిందా లేదా అభ్యర్ధులు ఇద్దరిలో ఒకరు తప్పు చేశారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది.

Also read: Hijab Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక కొత్త ప్రభుత్వం నిర్ణయమేంటి, ఏం జరగనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News