ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 సంవత్సరాల వయస్సు దాటిన వారికి స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగానికి తగరని తేలితే 50 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2018 మార్చి 31 నాటికి 50 సంవత్సరాలు దాటిన దాదాపు 4 లక్షల మంది సమయపాలన, విధుల్లో నిర్లక్ష్యం సహా ఇతర రిమర్కులను పరిశీలించి రేటింగ్ ఇస్తారు. తక్కువ రేటింగ్ పొందిన సదరు ఉద్యోగిని రిటైర్మెంట్ తీసుకోమని ప్రభుత్వం సూచించనుంది. 50 సంవత్సరాలు దాటని వారిని మూడు నెలల ముందు నోటీసిచ్చి రాజీమానా చేయమని కోరొచ్చని నిబంధన ఉంది. ఈ నెల 31లోగా దీనిపై నివేదిక సమర్పించాలని సంబంధిత విభాగాల అధిపతులకు లేఖలు కూడా వెళ్లాయని సమాచారం.
ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఉద్యోగులను హింసించడమేనన్నారు. కాగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు సోమవారం సమావేశం కానున్నాయి.