Video: వామ్మో-విగ్గు, బ్లూటూత్ సెటప్-ఎస్సై పరీక్షలో అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థి

UP youth hitech cheating in SI exam: ఉత్తరప్రదేశ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి జరిగిన రాతపరీక్షలో ఓ అభ్యర్థి హైటెక్ చీటింగ్‌‌కి ప్లాన్ చేశాడు. కానీ ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 07:47 PM IST
  • యూపీ ఎస్సై పరీక్షలో అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థి
  • హైటెక్ కాపీయింగ్‌కి యత్నించిన అభ్యర్థి
  • విగ్గు, దాని కింద బ్లూటూత్‌తో పరీక్షకు హాజరు
 Video: వామ్మో-విగ్గు, బ్లూటూత్ సెటప్-ఎస్సై పరీక్షలో అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థి

UP youth hitech cheating in SI exam: ఉత్తరప్రదేశ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి జరిగిన రాతపరీక్షలో ఓ అభ్యర్థి హైటెక్ చీటింగ్‌‌కి ప్లాన్ చేశాడు. కానీ ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అతగాడి సెటప్ చూసి పోలీసులే షాక్ తిన్నారంటే అతిశయోక్తి కాదు. ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా అన్నీ సెట్ చేసుకున్నాడు... కానీ సెక్యూరిటీ డిటెక్టర్‌కి దొరికిపోయాడు. ఐపీఎస్ రూపిన్ శర్మ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ అభ్యర్థి ఎవరూ గుర్తుపట్టకుండా విగ్గును ధరించి... దాని కింద ఒక చిప్‌తో కూడిన బ్లూటూత్‌ను అమర్చాడు. అలాగే రెండు అతిచిన్న ఇయర్ ఫోన్స్‌ను చెవుల్లో పెట్టుకున్నాడు. ఇక దర్జాగా పరీక్షరాసేయొచ్చు అన్న నమ్మకంతో ఎగ్జామ్ హాల్‌కి వచ్చినట్లున్నాడు. కానీ సెక్యూరిటీ సిబ్బంది డిటెక్టర్‌తో చెక్ చేయడంతో దొరికిపోయాడు. దీంతో అతన్ని ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు తీసుకొచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతని సెటప్‌ చూసి పోలీసులే షాక్ తిన్నారు.

ఒకవేళ డిటెక్టర్‌తో చెక్ చేసినప్పుడు అతను పట్టుబడి ఉండకపోతే... ఎగ్జామ్ హాల్‌లో అతను చీటింగ్‌కి పాల్పడుతున్నాడనే విషయం గుర్తించడం కష్ట సాధ్యమయ్యేది. అడ్డంగా దొరికిపోవడంతో అతను నేరం అంగీకరించక తప్పలేదు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం యూత్ ఈ స్థాయిలో చీటింగ్‌కి యత్నిస్తున్నారా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read: Video: 13 అడుగుల కింగ్ కోబ్రా-12 మంది స్నేక్ క్యాచర్స్‌కి ముచ్చెమటలు పట్టించింది

Trending News