1 Crore Lottery Winner: ఆరు రూపాయలు ఖర్చు పెట్టి రూ.కోటి గెలుచుకున్నాడు!

1 Crore Lottery Winner: ఆరు రూపాయలు ఖర్చు పెట్టిన ఓ వ్యక్తి ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకంటున్నారా? మీరు విన్నది నిజమే! కేవలం రూ.6 లాటరీ టికెట్టు తో కోటీ రూపాయలు గెలుచుకున్నాడు. ఇంతకీ ఆ సంగతి ఏంటో మీరు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 01:12 PM IST
1 Crore Lottery Winner: ఆరు రూపాయలు ఖర్చు పెట్టి రూ.కోటి గెలుచుకున్నాడు!

1 Crore Lottery Winner: ఆరు రూపాయల లాటరీకి ఏకంగా కోటి రూపాయలను గెలుచుకున్నాడు పశ్చిమ బంగాకు చెందిన ఓ వ్యక్తి. బంగాల్ లోని జాయ్ నగర్ కు చెందిన ప్రబీర్ ప్రమాణిక్ లాటరీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన ప్రబీర్ ప్రమాణిక్.. వృత్తి పరంగా సంపద ఆర్జించలేకపోయినా, లాటరీ ద్వారా కోటీశ్వురుడు అయ్యాడు.

ప్రస్తుతం జాయ్ నగర్ బస్ ట్రాకర్ ఆర్గనైజేషన్ లో ఓ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. తనకు ఉన్న వ్యసనంతో ఎప్పటిలాగే ఓ లాటరీ టికెట్టు కొన్నాడు. అయితే ఈ సారి ఆ లాటరీతో అదృష్టం వరించింది. ఒక్క లాటరీ టికెట్టుతో ఏకంగా కోటీ రూపాయలను గెలుచున్నాడు. అయితే ఆయన కొన్న లాటరీ టికెట్టు విలువ కేవలం రూ.6లే కావడం విశేషం. దీంతో ప్రబీర్ ఆనందానికి అవధులు లేవు.

అయితే తాను గెలుచుకున్న డబ్బులతో మొదట తాను చేసిన అప్పును తీర్చుకోనున్నట్లు ప్రబీస్ ప్రమాణిక్ స్పష్టం చేశాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఇంటిని బాగు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. వీటితో పాటు తన కుటుంబ అవసరాలను తీర్చాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.

అయితే అంత డబ్బు గెలుచుకున్న తర్వాత అతడి నుంచి దొంగలు దోచుకుపోకుండా.. ముందుగానే పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బుకు రక్షణ కల్పించాలని ముందస్తు అభ్యర్ధన పెట్టుకున్నాడు.

దీంతో ఒక్క లాటరీతో కోటీశ్వరుడిగా మారిన ప్రబీర్ ప్రమాణిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలిచాడు. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతడు సాధించిన లాటరీ టికెట్టు గురించి పలువురు ఆరా తీయడం మొదలుపెట్టారు. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుతో పాటు అతడిని చూసేందుకు జనాలు ప్రబీర్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు.  

Also Read: Smart Monkey Videos: మెట్లు దిగలేని స్మార్ట్ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో చూసేయండి!

ALso Read: Chilli potato making video: చిల్లి పొటాటో చేయడంలో ఎవరైనా ఈ బుడ్డోడి తర్వాతేనట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News