ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగగానే పార్టీలు తమ విజయంపై దృష్టి సారించాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొంత సమయానికే సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గత అయిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులతో హ్యాపీగా ఉన్నట్లయితే ఆప్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ కోరారు. తనను పోటీగా భావిస్తే నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి సీఎం సీటు కోసం పోటీ పడాల్సి ఉంటుందని.. అలా జరుగుతుందని తాను భావించడం లేదంటూ మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ బదులిచ్చారు.
‘ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, డీడీఏ విభాగాలను బీజేపీ నడిపిస్తోంది. విద్య, విద్యుత్, రోడ్లు, వాటర్ సప్లై, నిర్మాణ పనులను ఆప్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏ పార్టీ ప్రజలకు సరిగ్గా సేవ చేసిందో గుర్తించి ఆలోచించి ఓటు వేయాలని’ ఓటర్లను ఉద్దేశించి సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. సీఏఏ ఢిల్లీ ఓటర్లను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, దేశ రాజధాని ప్రజలు కేవలం అభివృద్ధికి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ అభివృద్ధి కోసం చాలా శ్రమించానని, అసెంబ్లీ ఎన్నికలు సీఏఏకు ప్రాధాన్యం ఇవ్వవన్నారు. ప్రజల మౌళిక అవసరాల కోసం ఆప్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందన్న కేజ్రీవాల్.. ఢిల్లీని మరింతగా అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఢిల్లీ ప్రజలు తమకే పట్టం కడతాదరని ధీమా వ్యక్తం చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 స్థానాలకు గానూ 67 నెగ్గి ఆప్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీ 3 సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
సీఎం పదవికి మోదీ పోటీనా! : కేజ్రీవాల్ క్రేజీ రిప్లై