Aadhaar-Voter Id Card Link: త్వరలో ఓటరు ఐడీతో కూడా ఆధార్ లింక్ తప్పదా...

Aadhaar-Voter Id Card Link: ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2022, 04:55 PM IST
  • త్వరలో ఓటరు ఐడీ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం
  • 20 ఏళ్లుగా పెండింగులో ఉన్న ప్రక్రియ అని వెల్లడించిన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర
  • నకిలీ ఓటర్లను నియంత్రించేందుకే ఈ ప్రక్రియ అని వెల్లడి
Aadhaar-Voter Id Card Link: త్వరలో ఓటరు ఐడీతో కూడా ఆధార్ లింక్ తప్పదా...

Aadhaar-Voter Id Card Link: ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం..

నిత్యజీవితంలో ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. రేషన్ కార్డుతో, పాన్ కార్డుతో ఇలా ప్రతి ఒక్కటితో ఆధార్‌కు లింక్ ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఓటరు ఐడీ కార్డును ఆధార్ కార్డుతో లింకే చేసేందుకు యోచిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం ఆధార్ కార్డు వివరాలు ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది ఐఛ్ఛికమని చెప్పారు. ఆ వివరాల్ని వెల్లడించకూడదనుకుంటే..నిరాకరించవచ్చని..అయితే కారణం వివరిచాల్సి ఉంటుంది. 

ఛీఫ్ ఎలక్షన్ కమీషన్ సుశీల్ చంద్ర ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించడంలో కీలకపాత్ర పోషించారు. 18 ఏళ్ల నిండినవారిని ఓటర్లుగా చేర్చుకునేందుకు  4-5 తేదీలు కేటాయించడం, నకిలీ ఓటర్లను నియంత్రించేందుకు ఆధార్ కార్డును ఓటరు ఐడీ కార్డుతో అనుసంధానించడమనేది తన హయాంలో జరిగిన రెండు ప్రదాన ఎన్నికల సంస్కరణలని సుశీల్ చంద్ర తెలిపారు.

గతంలో అయితే కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించుకునేవారికి జనవరి 1వ తేదీ నిర్ధారిత కటాప్ తేదీగా ఉండేది. అంటే జనవరి 2 జన్మించినా..మరో ఏడాది ఆగాల్సి వచ్చేది. అందుకే ఈసారి కటాప్‌గా నాలుగు తేదీలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సంస్కరణ 20 ఏళ్లుగా పెండింగులో ఉందని సుశీల్ చంద్ర గుర్తు చేశారు. 

నకిలీ ఓటర్లు నియంత్రించేందుకే ఓటరు ఐడీ-ఆధార్ కార్డు అనుసంధానం ప్రవేశపెట్టనున్నామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎవరికి వారు ఓటర్లు తమ ఆధార్ నెంబర్‌ను ఓటరు ఐడీకు లింక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ఐఛ్ఛికం మాత్రమే. మ్యాండేటరీ కాదు. ఇష్టం లేకపోతే నిరాకరించవచ్చు కానీ కారణం చెప్పాలి. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పుల్ని సరిదిద్దేందుకు ఆధార్ లింకింగ్ ప్రక్రియ దోహదపడనుంది. 

Also read: India Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News