సంచలన వ్యాఖ్య; 'సెక్యూలర్' పదాన్ని తొలగిస్తామన్న కేంద్ర మంత్రి

మేము ఉన్నది రాజ్యాంగాన్ని మార్చడానికి. కేంద్ర ప్రభుత్వం రాజ్యంగం నుంచి 'లౌకికవాదం (సెక్యులర్)' అనే పదాన్ని తొలగించాలని భావిస్తోంది అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Dec 26, 2017, 05:51 PM IST
సంచలన వ్యాఖ్య; 'సెక్యూలర్' పదాన్ని తొలగిస్తామన్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కొప్పల్ లో ఆయన మాట్లాడుతూ- మేము ఉన్నది రాజ్యాంగాన్ని మార్చడానికి.  రాజ్యంగం నుంచి 'లౌకికవాదం (సెక్యులర్)' అనే పదాన్ని తొలగించాలని కేంద్రం భావిస్తోందని వ్యాఖ్యానించారు..ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హెగ్డే సెక్యులర్ వాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్ర మంత్రి హెగ్డే మాటల్లో చెప్పాలంటే " కొందరు తాము లౌకికవాదులమని చెప్పుకుంటూ ఓ కొత్త సంస్కృతిని అవలంభిస్తున్నారు. ఒక వ్యక్తి తాను ముస్లింని అని.. క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు..అలాగే మరోకరు లింగాయత్ అని.. హిందూ అని చెప్పుకుంటున్నారు..ఇలా ఎవరైనా చెప్పుకుంటే సంతోషిస్తా.. ఎందుకంటే వారికి సంబంధించిన మూలాలు వారికి తెలుసు కాబట్టి.  కానీ తమను తాము లౌకికవాదులుగా చెప్పుకొని ఆ పదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పితే..ఆ పదానికి అర్థం వచ్చే రీతిలో వ్యవహరించడం లేదు.. లౌకికవాదులమని చెప్పుకుంటూ రాజకీయం చేసే వారిని  ఏమని పిలవాలో నాకు తెలియదు" అని హెగ్డే చెప్పారు. 

సెక్యూలర్ వాదులమని చెప్పుకుంటున్న కొందరికీ "వారి పుట్టుక.. రక్తం ఏంటో కూడా తెలియదు. వారికి వారి తమ తల్లితండ్రులెవరో తెలియదుకానీ ... తమను తాము 'సెక్యూలర్ వాదులు చెప్పుకోవడం సిగ్గు చేటు. ఫలానా వ్యక్తి తాను  సెక్యూలర్ అని ఎవరైనా చెప్పుకుంటే.. సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మన దేశంలో సెక్యులరిస్టులే లేరని భావిస్తున్నా అంటూ కేంద్ర మంత్రి హెగ్డే సెక్యూలర్ వాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..

సెక్యూలర్ పదం దుర్వినియోగం

సెక్యూలర్ పదం రాజ్యంగంలో పొందుపర్చి ఉండటం వల్ల దాన్ని తాము గౌరవిస్తామని..కానీ అది దున్వియోగం అవుతున్నందు వల్ల ఇది సమీప భవిష్యత్తులో మార్చాల్సిన అవసరం ఏర్పడింది..రాజ్యంగం సవరణ అనేది మన చేతుల్లో ఉంది..దాన్ని సవరిస్తే ఎలాంటి తప్పలేదు.. రాజ్యాంగం అనేకసార్లు మార్చబడిందనే విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. జనాలకు మేలు చేకూర్చేందుకు తాము రాజ్యాగాన్ని సవరించడంలో తప్పు లేదని కేంద్ర మంత్రి హెగ్డే వ్యాఖ్యానించారు.

Trending News