Dj Siddharth: హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు... ఫెమస్ డీజేతో పాటు మరోకరికి పాజిటివ్..

Hyderabad: పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న ఫెమస్ డీజే సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో డీజే డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో బైటపడింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 17, 2024, 01:26 PM IST
  • వెలుగులోకి మరో డ్రగ్స్ కేసు..
  • హైదరాబాద్ ను జల్లెడపడుతున్న పోలీసులు..
Dj Siddharth: హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు... ఫెమస్ డీజేతో పాటు మరోకరికి పాజిటివ్..

Famous dj siddharth found taking drugs in madhapur Hyderabad: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ బాధ్యతలు స్వీకరించినప్పటి  నుంచి డ్రగ్స్,గాంజా, మత్తు పదార్థాల అమ్మకాలను ఉక్కుపాదం మోపారు. అధికారులకు కూడా వీటిని కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా డ్రగ్స్ విక్రయాలపై ప్రత్యేకంగా నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ఎస్ఓటి అధికారులు హైదరాబాద్ లోని పలు పబ్ లకు రెగ్యులర్ గా వెళ్లేవారిపై ప్రత్యేకంగా నిఘాపెట్టారు. ఈ నేపథ్యంలో.. 40 మందిని పిలిపించి విచారించారు. వీరిపై అనుమానం కల్గడంతో వీరి రక్తపు నమూనాలు సేకరించారు.

Read more: Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..

అయితే.. ఈటెస్టులలో ఫెమస్ .. పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. మరోక వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు బైటపడింది. వెంటనే రంగంలోకి దిగిన వీరిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ కు తరలించారు.  ఎస్‌ఓటీ పోలీసులు.. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారిపై నిఘా ఉంచారు. 

గత కొంతకాలం నుంచి సిద్దార్థ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అధికారులు డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థ్ ను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్ కు సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇది కాస్త ఆందోళన కల్గించే అంశంగా మారింది.

ముఖ్యంగా కాలేజీలు, బడాబాబుల పిల్లలు ఉండే ప్రదేశాల్లో చిన్న చిన్న పొట్లాలలో డ్రగ్స్ ను  ప్యాక్ లు చేసి, అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన కిలేడీ భార్యభర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారు గోవా నుంచి డ్రగ్స్ పొట్లాలను తీసుకొచ్చి.. హైదరాబాద్ లో విక్రయించి భారీగా డబ్బులు సంపాదించినట్లు సమాచారం.

Read more: Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?

దీంతో ఇప్పుడు మరోసారి తెలంగాణలో డ్రగ్స్ కేసు ఘటన తీవ్ర ఆందోళన కల్గించే అంశంగా మారింది. మరోవైపు సినిమా ఇండస్ట్రీని కూడా డ్రగ్స్  భూతం వెంటాడుతుంది. ఇటీవల నటి హేమను బెంగళూరు డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆమె బెయిల్ పైన విడుదలైంది. డ్రగ్స్ ఘటనపై పోలీసులు మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాలేజీలు, స్కూల్స్ దగ్గరు ఎవరైన అనుమానస్పదంగా ఉంటే వెంటనే..డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News