Women eloped with masons: మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తాపీ మేస్త్రీలతో చెక్కేసిన ఇద్దరు కోడళ్లు

Two daughters in law eloped with Masons: పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని నిశ్చిందా ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఇద్దరు తాపీ మేస్త్రీలతో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. మొదట ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదవగా... ఆ తర్వాత ఇద్దరు తాపీ మేస్త్రీలతో కలిసి పారిపోయినట్లు తెలిసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 03:16 PM IST
  • బెంగాల్ మహిళల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
  • తాపీ మేస్త్రీలతో పారిపోయిన మహిళలు
  • మరమ్మతులు చేసేందుకు వచ్చిన మేస్త్రీలతో ప్రేమలో పడ్డ మహిళలు
Women eloped with masons: మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తాపీ మేస్త్రీలతో చెక్కేసిన ఇద్దరు కోడళ్లు

Two daughters in law eloped with Masons: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) హౌరాలోని నిశ్చిందా ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల కనిపించకుండా పోయారు. దీంతో అత్తింటివారు ఇద్దరి మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళల సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఆ ఇద్దరు మహిళలు తాపీ మేస్త్రీలతో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే... నిశ్చిందా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటికి ఇటీవల ఇద్దరు తాపీ మేస్త్రీలు మరమ్మతులు నిర్వహించారు. ఆ సమయంలో ఆ ఇంటికి చెందిన ఇద్దరు కోడళ్లతో తాపీ మేస్త్రీలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన ఇద్దరు కోడళ్లు స్వెటర్లు కొనుక్కుంటామని ఇంట్లో చెప్పి శ్రీరాంపూర్ ప్రాంతానికి వెళ్లారు. అంతే.. అలా వెళ్లిన ఆ ఇద్దరు మళ్లీ తిరిగిరాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ అయిపోయాయి.

ఇద్దరు కోడళ్ల మిస్సింగ్‌పై (Missing case) ఆ ఇంటి పెద్ద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. చివరిసారిగా ఆ ఇద్దరి సెల్‌ఫోన్ సిగ్నల్ శ్రీరాంపూర్ ప్రాంతంలో చూపించింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో వెతకగా వారికి కొన్ని ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో ఓ సెల్‌ఫోన్ నంబర్ కూడా చిక్కింది. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేయగా... చివరిసారిగా ముర్షీబాద్ లొకేషన్‌లో ఉన్నట్లు చూపించింది. దీంతో పోలీసులు ముర్షీదాబాద్ ప్రాంతానికి వెళ్లి వెతకగా... ఆ నంబర్ ఒక తాపీ మేస్త్రీది అని, అతను అదే ప్రాంతంలో నివాసముంటున్నాడని తెలిసింది.

ముర్షీదాబాద్‌లోని అతని ఇంటికి వెళ్లగా తాళం వేసి కనిపించింది. ఆ ఇద్దరు మహిళలు శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి ముర్షీదాబాద్‌లోని తాపీ మేస్త్రీల ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి నలుగురు కలిసి ముంబై వెళ్లినట్లు తేల్చారు. ముంబైలో (Mumbai) ఉన్న ఆ నలుగురిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని అక్కడికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఇద్దరు కోడళ్లలో ఒకరు తన ఆరేళ్ల కొడుకుని కూడా వెంట తీసుకెళ్లినట్లు తెలిపారు.

Also Read: Dhanush Telugu movie: టాలీవుడ్​లోకి ధనుష్ 'సార్​' ఎంట్రీ ఇస్తున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News