న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత పది రోజుల్లో కరోనా కేసుల ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 11న ముఖ్యమంత్రుల సమావేశంలో అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం మేరకు దానితో పాటు ప్రజలు కూడా ఏప్రిల్ 30 వరకే పొడగిస్తారని ఊహించారు. కానీ ప్రధాని మోదీ ఈ రెండింటికి బిన్నంగా మే 3వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా మే 1న మేడే సందర్భంగా పబ్లిక్ సెలవుదినం కానుండగా, మే 2, 3 వారాంతపు రోజులు రానున్నాయి. ఈ రెండు కారణాలను పరిగణలోకి తీసుకొని ప్రధాని మోదీ మే 3 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించారని భావిస్తున్నారు. లాక్‌డౌన్ పొడిగించినప్పటికీ కరోనా వ్యాప్తి సంక్రమణ నివారణయే ధ్యేయంగా ఈ నెల 20వ తేదీని ప్రధాని టార్గెట్ విధించారు. వచ్చే వారం రోజులపాటు పూర్తిగా అప్రపమత్తంగా ఉండాలని,ఇది అగ్ని పరీక్ష అని తెలిపారు.
విధించుకున్న లక్ష్యం మేరకు కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడంతో పాటు అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తిరిగి పునరుత్తేజం కల్పించుకోవడమే ముఖ్యమని అన్నారు. కాగా ఏప్రిల్ 20 వరకు కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయగలితే ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపు, వివిధ రంగాలకు మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు.
Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు