కర్నాటక అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ నేత యడ్యూరప్ప తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు మరో బీజేపీ ఎంపీ శ్రీరాములు రాజీనామాకు కూడా లోక్ సభ స్పీకర్ ఆమోదం తెలిపారు.
ఇదిలా ఉండగా శనివారం ఉదయం కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బోపయ్య ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరితోనూ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంలో యడ్యూరప్ప కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏదో ఒక పదవిలో మాత్రమే ఉండాలి కాబట్టి యడ్యూరప్ప తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగే అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీ గెలుపు సాధిస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
కర్నాటక రాజకీయం: యడ్యూరప్ప రాజీనామా !