Kl Rahul Record: లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో సరికొత్త రికార్డు..ఏమిటది!

Kl Rahul Record: ఐపీఎల్-2022లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి..జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో లక్నో టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈక్రమంలో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 05:15 PM IST
  • కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్
  • కోల్‌కతా మ్యాచ్‌లో అలరించిన కెప్టెన్
  • ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో
Kl Rahul Record: లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో సరికొత్త రికార్డు..ఏమిటది!

Kl Rahul Record: ఐపీఎల్-2022లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి..జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో లక్నో టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈక్రమంలో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు.  వరుసగా ఐదో సీజన్‌లో 500లకుపైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ టోర్నీలో ఎవరికీ అందని ఘనతను సాధించాడు. 2008లో ఐపీఎల్‌ మొదలైంది. అప్పటి నుంచి ఇంత వరకు ఆ రికార్డు ఎవరూ సాధించలేదు. తాజాగా ఆ ఫీట్‌ను కేఎల్‌ రాహుల్ అందుకున్నాడు.

ఈసీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న లక్నో సారధి కేఎల్ రాహుల్ 14 మ్యాచ్‌లు ఆడి..537 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌ రేట్‌ 135.26గా ఉంది. ఇందులో రెండు సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్‌ రాహుల్ ..2018లో 659, 2019లో 593 పరుగులు చేశాడు. 2020లో 670, 2021లో 626, ఈసీజన్‌లో ఇప్పటివరకు 537 పరుగులు సాధించాడు.

మరోవైపు ఈసీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాజస్థాన్‌ ఆటగాడు జోస్ బట్లర్ తొలి స్థానంలో ఉన్నాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 627 పరుగులు చేశాడు. నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్(KL RAHUL) రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ డికాక్‌తో కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈమ్యాచ్‌లో డికాక్ 70 బంతులు  ఎదుర్కొని 140 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 10 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఈజోడీ సైతం ఐపీఎల్‌లో అరుదైన రికార్డును నెలకొల్పింది.

Also read:Virat Kohli: అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు..!

Also read:Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News