3 Things To Avoid After Facial: ముఖంలో గ్లో రావాలంటే చాలా మంది పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు. కానీ చాలా సార్లు ఫేషియల్ చేసినా ముఖం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా చాలా మందిలో ముఖంపై కూడా పలు రకాల సమస్యలు వస్తున్నాయి. అయితే ఫేషియల్ చేసిన వెంటనే మెరుపు రాదని..ఈ క్రమంలో క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని మేకప్ ఆర్టిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఫేషియల్ చేయించుకున్న తర్వాత చర్మానికి హాని కలిగించే కొన్ని పనులు చేస్తున్నారని వీటిని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఫేషియల్ చేసిన తర్వాత ఈ పని అస్సలు చేయోద్దు:
సూర్యకాంతికి దూరంగా ఉండండి:
ఫేషియల్ తర్వాత నేరుగా సూర్యకాంతిలో వెళ్లడం మంచిది కాదని మేకప్ ఆర్టిస్టులు చెబుతున్నారు. ఫేషియల్ తర్వాత మన చర్మం చాలా సున్నితంగా మారుతుందని..సూర్య కిరణాలు చర్మంపై నేరుగా పండడం వల్ల చాలా రకాల సమస్యలు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఫేషియల్ చేయించుకున్న తర్వాత బయటకు వెళ్లడం మంచిది కాదు. ఒక వేళ వెళ్తే స్కిన్ అలర్జీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
జిమ్‌కు వెళ్లడం:
ఫేషియల్ తర్వాత జిమ్‌కు వెళ్లడం మానుకోండి. ఎందుకంటే జిమ్‌కి వెళ్లడం వల్ల ముఖంపై చెమట పట్టి, చర్మానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంలోని మెరుపు కూడా తగ్గిపోతుంది. అందుకే ఫేషియల్ తర్వాత జిమ్ లేదా భారీ వ్యాయామాలకు దూరంగా ఉండాలి.
ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేయండి:
ఫేషియల్ తర్వాత చర్మంపై రంద్రాలు తెరుచుకుంటాయి.. కాబట్టి మరే ఇతర ఫేస్ ప్యాక్ వినియోగించకుండా ఉంటే మంచిదని మేకప్ ఆర్టిస్టులు చెబుతున్నారు. ఏదైనా ఇతర ఫేస్ ప్యాక్ వేయడం వల్ల చర్మంపై చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండాఇలా అప్లై చేయడం వల్ల ఎర్రటి దద్దుర్లు వంటి సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి