Benefits Of Kissing : ముద్దు పెట్టుకుంటే చర్మానికి చాలా ప్రయోజనాలు.. అవి ఏమిటో తెలుసా!

Beauty Benefits of Kissing: ముద్దు పెట్టుకోవడం వల్ల మీ చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే ముద్దు పెట్టుకుంటే చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 04:39 PM IST
  • పార్ట్‌నర్స్‌ మధ్య దూరాన్ని తగ్గించే 'ముద్దు'
  • ముద్దుతో చాలా ఉపయోగాలు
  • ముద్దు పెట్టుకోవడం వల్ల మీ చర్మానికి చాలా ప్రయోజనాలు
Benefits Of Kissing : ముద్దు పెట్టుకుంటే చర్మానికి చాలా ప్రయోజనాలు.. అవి ఏమిటో తెలుసా!

5 Scientific Benefits Of Kissing and why we should kiss more often : ముద్దు.. ఈ పదమే ప్రేమికులకు, భాగస్వాములకు ఎంతో ముద్దు. రిలేషన్‌షిప్‌లో ఒక మంచి 'ముద్దు' (kiss) పార్ట్‌నర్స్‌ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మీ భాగస్వామిపై మీకున్న ప్రేమను ముద్దుతో వ్యక్త పరచవచ్చు. మరి ముద్దుతో వచ్చే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. 

ముద్దు పెట్టుకోవడం వల్ల మీ చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉదయాన్నే ముద్దు పెట్టుకుంటే చర్మానికి (skin) ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి చూడండి.

చర్మం పొడిబారదు.. 

చర్మం పొడిబారడానికి, యాంటీ ఏజింగ్ (Anti aging) సమస్యలకు ముఖ్య కారణం ఒత్తిడి. అయితే ముద్దు పెడితే మీ ఒత్తిడి మొత్తం పోతుందట. మీ భాగస్వామికి ప్రేమగా ముద్దు పెడితే మీకే ఎంతో మేలట. ఇక ఒక వ్యక్తి తన జీవితంలో కనీసం 20,000 నిమిషాల కంటే ఎక్కువ సమయం ముద్దు పెట్టుకుంటాడని కొన్ని పరిశోధనల్లో తేలింది.

కండరాలు ఉత్తేజంగా మారుతాయి..

ముద్దు పెట్టుకుంటే మీ ముఖంలోని 34 కండరాలు (Muscles) ఉత్తేజమవుతాయి. ముద్దు పెట్టుకునే సమయంలో ఆ కండారులు 112 యాంగిల్స్‌లలో పని చేస్తాయి. ముద్దు పెట్టడం వల్ల మీ ముఖ కండరాలను దృఢంగా మారుతాయి. అలాగే రక్త ప్రసరణ (Blood circulation) కూడా మెరుగవుతుంది. 

కాంతివంతమైన చర్మం

ముద్దు పెట్టుకోవడం వల్ల మీ చర్మం (Skin) కాంతివంతంగా మారుతుంది. మీ స్కిన్‌లో 'లవ్‌ హార్మోన్ లేదా హగ్ హార్మోన్' పెరుగుతుంది. దీనినే ఆక్సిటోసిన్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజమవుతాయి. చర్మం మొత్తం కాంతివంతంగా మారుతుంది.

ముడతలు రావు..

ముద్దు పెట్టుకోవడంతో.. మీ పెదవులు, నాలుక, బుగ్గలు, ముఖం, దవడ, మెడ కండరాలకు ఒక వ్యాయామం మాదిరిగా ఉంటుంది. దీంతో ముఖంలో (Face) అన్ని కండరాలు పని చేయాల్సి వస్తుంది. అలా రక్త ప్రసరణ మెరగవుతుంది. ఫలితంగా ముఖంపై ముడుతలు అనేవి రాకుండా ఉంటాయి.

Also Read : Harbhajan Singh Retirement: హర్భజన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

యాంటీ ఏజింగ్..
ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే రెండు చర్మ-పోషక ప్రొటీన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో యాంటీ ఏజింగ్ సమస్యల బారిన పడకుండా ఉంటారు.

పళ్లకు రక్షణ

ముద్దు పెట్టుకునే క్రమంలో మీ నోటిలో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది దంతాలకు (Teeth) మేలు చేస్తుంది. దంత క్షయం రాకుండా చేస్తుంది. పళ్లకు రక్షణగా ఉంటుంది.

Also Read : Alia Bhatt: అలియా భట్.. రణ్‌బీర్‌ కపూర్‌ ఏమైనా తాగి ఉన్నాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News