Airtel Fraud Message: ఎయిర్ టెల్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. ఇలా చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

Airtel Fraud Message: మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే కొన్ని కంపెనీ మెసేజ్ లు అంటూ వచ్చే వాటితో మీరు చాలా జాగ్రత్తగా వహించకతప్పదు. ఎందుకంటే ఇటీవలే మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి ఎయిర్ టెల్ పేరుతో వచ్చిన మెసేజ్ ద్వారా ఏకంగా రూ. 1.48 లక్షలు పోగొట్టుంది. ఇదే విషయమై ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 02:05 PM IST
    • ఎయిర్ టెల్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త
    • KYC మోసాలతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
    • రూ.1.48 లక్షలను పొగొట్టుకున్న మరాఠీ నటి
Airtel Fraud Message: ఎయిర్ టెల్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. ఇలా చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

Airtel Fraud Message: ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలు కూడా నానాటికి పెరిగిపోతున్నాయి. పెరిగిన సాంకేతికతలోనూ సైబర్ మోసగాళ్లు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో KYC మోసాల కేసులు కూడా భారీగా వెలుగుచూస్తున్నాయి. ముంబయికి చెందిన ఓ నటి బ్యాంకు ఖాతా నుంచి ఇటీవలే రూ. 1.48 లక్షలు మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సదరు మరాఠీ నటి పోలీసులను ఆశ్రయించింది.  

ఒక్క మెసేజ్ వల్ల బ్యాంకు ఖాతా ఖాళీ..

వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయాలని కోరుతూ.. ఓ టెలికాం ఆపరేటర్ నుంచి మెసేజ్ వచ్చింది. తాను ఉపయోగించిన ఏటీఎం కార్డు వివరాల ద్వారా తనని మోసగించారని 64 ఏళ్ల మరాఠీ నటి విలే పార్లే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త మొబైల్ ఫోన్ నంబర్‌కు మెసేజ్ వచ్చిందని ఆమె అందులో వెల్లడించింది. ఎయిర్ టెల్ పేరుతో వచ్చిన మెసేజ్ లో KYC ప్రక్రియను పూర్తి చేయాలని ఉందని.. తన భర్త ఆ వివరాలను పొందిపరచకపోతే సదరు నంబరు బ్లాక్ చేస్తామని మెసేజ్ లో ఉన్నట్లు ఆమె తెలిపింది. 

రూ.1.48 లక్షలు స్వాహా!

ఆమె నంబరుకు కాలు చేసి ఎయిర్ టెల్ ఎగ్జిక్యూటివ్ గా నటిస్తూ.. తనతో క్విక్ సపోర్ట్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేయించాడని తెలుస్తోంది. ఆ యాప్ మొబైల్ కార్యకలాపాలను యాక్సెస్ చేసేందుకు అనుమతినిస్తుంది. అయితే సదరు నటి ఆ సైబర్ నేరగాడు చెప్పే ప్రతి సూచనను పాటిస్తూ.. చివరికి రూ. 1.48 లక్షలను తన బ్యాంకు ఖాతా నుంచి పోగొట్టుకుంది. 

అయితే అనుమానం వచ్చి ఎయిర్ టెల్ సపోర్ట్ ను సంప్రదించగా.. తమ ఎగ్జిక్యూటివ్స్ ఎవరికీ కాల్ చేయరని స్పష్టం చేసింది. అయితే ఆ సైబర్ నేరగాడు తన క్రెడిట్ కార్డు వివరాలను ఉపయోగించి.. ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతో చేసేదేమి లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.  

Also Read: Face Mask Beauty: చందమామలా మెరిసే ముఖసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

Also Read: Internet Speed Tips: Wifi స్పీడ్ తగ్గిందా..? అన్లిమిటెడ్ & హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News