Internet Speed Tips: కరోనా సంక్షోభం కారణంగా ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ కోసం ఇంట్లో ఉండే Wi-Fiపై ఆధారపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండటం తరచుగా జరుగుతుంటుంది. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు నెలవారీ రుసుము చెల్లించిన తర్వాత కూడా మీరు ఇంటర్నెట్ సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే ఇంటర్నెట్ స్పీడ్ కోసం ఈ టిప్స్ ను పాటించండి.
ఇంటి మధ్యలో Wi-Fi రూటర్..
మీ Wi-Fi రూటర్‌ని ఇంటి మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల అన్ని మూలలకు సమానమైన సిగ్నల్ అందుతుంది. మీరు ఇంటర్నెట్ ఏ ప్రదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారనే దానిపై ఆ రూటర్ ను బిగించుకోవడం మంచిది. అలా చేయడం వల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.
ఎత్తైన ప్రదేశంలో ఉంచండి
సాధారణంగా వైఫై రూటర్లు సిగ్నల్ ను కిందకు విస్తరించే ధోరణి కలిగి ఉంటాయి. కాబట్టి వైఫై కవరేజీని బట్టి రూటర్ ను వీలైనంత ఎత్తైన ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. అలా చేయడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా..
వైఫై రూటర్ ను ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా మెటల్ వస్తువులకు దూరంగా ఉండే స్థానాన్ని ఎంచుకొని అక్కడ ఏర్పాటు చేయాలి. గోడలు, పెద్ద అడ్డంకుల లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల కారణంగా మీ వైఫై విస్తరణ తగ్గిపోయి.. ఇంటర్నెట్ స్పీడ్ కూడా తగ్గే అవకాశం ఉంది.
Also Read: UPSC Interview Questions: UPSC లెవల్ క్వశ్చన్.. మార్కెట్లో కొనలేని ఫ్రూట్ పేరు ఏంటి?
Also Read: WhatsApp Tricks: మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మెసేజ్ చేయాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook