Beauty Tips: బియ్యప్పిండి తో మూడు రాత్రులు ఇలా చేయండి.. ఇక అందం మీ సొంతం

Dark Spots Removal Mask: మొటిమలు తగ్గిపోయినా కూడా వాటి వల్ల వచ్చే మచ్చలు మాత్రం మొహం మీద ఉండిపోయి.. ముఖాన్ని కాంతిహీనంగా చేస్తాయి. కానీ ప్రతి ఇంట్లో ఉండే నాలుగే నాలుగు పదార్థాలతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే, మూడే మూడు రాత్రుల్లో ముఖం సహజంగా కాంతులీనుతుంది. మరి ఆ ప్యాక్ ఏమిటో తెలుసుకుందాం రండి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 29, 2024, 02:34 PM IST
Beauty Tips: బియ్యప్పిండి తో మూడు రాత్రులు ఇలా చేయండి.. ఇక అందం మీ సొంతం

Miracle Face Mask : ఈ వేసవికాలంలో.. పూటకి ఒకసారి మొహం కడుక్కుంటున్నప్పటికీ.. చమటల కారణంగా.. జిడ్డు బాగా పేరుకుపోయి.. మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు తగ్గిపోయిన తరువాత కూడా నల్ల మచ్చలు నీడలాగా వెంటాడుతూ ఉంటాయి. దీంతో ముఖం కాంతివంతంగా ఉన్నప్పటికీ, నల్ల మచ్చలు డామినేట్ చేస్తాయి. కానీ కేవలం మూడు అంటే మూడే రోజుల్లో.. ముఖం మీద ఉన్న అన్నీ నల్ల మచ్చలని మాయం చేసేయొచ్చు. దానికి మనం బోలెడంత డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆఖరికి గంటలు గంటలు సమయం కూడా కేటాయించాల్సిన పనిలేదు. ప్రతి ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఈ ఫేస్ మాస్క్ ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసినవి కేవలం నాలుగు పదార్థాలు. అవును మీరు విన్నది నిజమే. మరి ఈ ప్యాక్ ఏమిటో చూసేద్దాం రండి..

ఈ ఫేస్ ప్యాక్ కి కావలసిన పదార్థాలు ఏమిటి అనగా..రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, కొంచెం నిమ్మరసం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, ఒక టేబుల్ స్పూన్ తేనె. 

ఎందుకు ఈ నాలు పదార్థాలే తీసుకుంటున్నాం అనే దాని వెనుక కూడా కారణాలు ఉన్నాయి. బియ్యప్పిండి మన చర్మాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కొంచెం గరుకుగా కూడా ఉంటుంది కాబట్టి, మన ముఖానికి మంచి ఎక్స్పోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది. మొండి మచ్చలని సైతం సులువుగా తొలగించేస్తుంది. మన ముఖాన్ని సహజరంగులోకి తిరిగి తీసుకొస్తుంది. 

ఇక నిమ్మరసంలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లాగా పని చేస్తుంది. అది మన శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. దానివల్ల మన స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది. 

గ్రీన్ టీ మన శరీరంపై ఉండే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. ముఖం కాంతివంతంగా మారేలాగా చేస్తుంది. ఇక తేనే ముఖం మీద ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది. మంచి యాంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది.

తయారీ విధానం:

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా బియ్యప్పిండిలో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ తేనె కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్-టీ కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. అంతే మన బియ్యప్పిండి ఫేస్ ప్యాక్ రెడీ. 

ఎలా వేసుకోవాలి:

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా కడుక్కుని ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాక్ ఆరిపోయాక మునివేళ్లతో ముఖం మీద సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత ముఖాన్ని నీళ్లతో కడుక్కోవాలి. కావాలి అనుకుంటే ముఖం కడుక్కున్నాక  మాయిశ్చరైసర్ అప్లై చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా మూడు రోజులు ఇలా చేస్తే ఫలితం మీకే అర్థమవుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది.

Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News