Belly Fat Loss: రోజూ యోగాలో ఈ 4 ఆసనాలు వేస్తే.. పొట్ట చుట్టూ కొవ్వుకు 10 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..!

Belly Fat Loss Exercise: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది జిమ్, యోగా వంటి క్రియలను చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 31, 2022, 12:04 PM IST
  • రోజూ యోగాలో ఈ 4 ఆసనాలు వేస్తే..
  • పొట్ట చుట్టూ కొవ్వుకు 10 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు
  • అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి
 Belly Fat Loss: రోజూ యోగాలో ఈ 4 ఆసనాలు వేస్తే.. పొట్ట చుట్టూ కొవ్వుకు 10 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..!

Belly Fat Loss Exercise: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది జిమ్, యోగా వంటి క్రియలను చేస్తున్నారు. ఇలా చేసిన చాలా మందిలో ఎలాంటి మార్పులు రావడం లేదు. అయితే చెడు కొలెస్ట్రాల్, పొట్ట చుట్టూ కొవ్వును నియంత్రించేందుకు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి అవసరం ఎంతగానో ఉంది. అంతేకాకుండా రోజూ పలు రకాల ఆసనాలతో యోగా కూడా చేయాల్సి ఉంటుంది. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ నియంత్రించేందుకు ఎలాంటి ఆసనాలతో యోగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆసనాలు తప్పని సరిగా చేయాలి:

ధనురాసనము (Dhanurasana):

ఈ ఆసనం చేయడం చాలా కష్టతరమైనప్పటికీ దీని వల్ల శరీరానికి చాలా రకాల ఉపయోగాలున్నాయి. దీనిని చేయడానికి ముందుగా పొట్టపై పడుకుని నడుమును వంచాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేస్తే  వెన్నునొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా కండరాలు కూడా బలోపేతం అవుతాయి. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది.

భుజంగాసనము (Bhujangasana)

12 సూర్య నమస్కార ఆసనాలలో 8 వదే భుజంగాసనము. దీనిని రోజూ వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు సమస్యలు దూరమవుతాయి. ఈ యోగాను ఖాళీ కడుపుతో మాత్రమే చేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

రివర్స్ రోయింగ్ ఆసనం (Rowing Boat Pose)

దీనిని చాలా మంది నౌకాసనం అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని చేయడానికి పొట్ట ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున పొట్ట సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా కొవ్వు సమస్యలు కూడా తొలగిపోతాయి.

శలభాసనము (Salabhasana)

ఈ ఆసనం చేయడానికి మీరు పొట్టపై పడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా  శరీరం మిడతలా కనిపిస్తుంది. అయితే ఈ ఆసనాన్నిరోజూ చేయడం వల్ల  చేతులు, తొడలు, కాళ్లులో కండరాలు బలోపేతమవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే

Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News